...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఈ సమయంలో కాస్త రాళ్లు వెనకేసుకొంటే కొంప మునుగుతుంది.

ఆధునిక కాలంలో అనేక అంశాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా జీవన శైలి బాగా మారుతోంది. కూర్చొన్న చోట నుంచి కదలకుండానే అన్నీ అమరిపోతుండటం చాాలా మార్పుల్ని తెచ్చిపెడుతోంది. అందులో ఏర్పడిన ముఖ్య సమస్యే ఇది.

జీర్ణ వ్యవస్థలో రాళ్లు ఏర్పడతాయి అంటే చాలామందికి అతిశయోక్తిగా అనిపిస్తుంది. కానీ, అనేక సంద‌ర్భాల్లో జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని కొన్ని భాగాల్లో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. ఇటువంటి సంద‌ర్బాల్లో కూడా క‌డుపు నొప్పి వంటి అనేక స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతుంటాయి. ఈ స‌మ‌స్య‌ను శాస్త్రీయంగా గుర్తించి చికిత్స అందిస్తేనే రోగికి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ లో కాలేయం నుంచి విడుద‌ల అయ్యే పైత్య ర‌సం(బైల్ జ్యూస్) లో బైలి రూబిన్‌, బైలి విరిడిన్ అనే వ‌ర్ణ‌కాలు ఉంటాయి. ఇవి పేరుకొని పోయిన‌ప్పుడు లేక కొలెస్ట‌రాల్ నిలిచి పోయిన‌ప్పుడు ఈ ద్రవ ప‌దార్థాలు గ‌ట్టి ప‌డి రాళ్లుగా మార‌తాయి. ఈ రాళ్లు కొలెస్ట‌రాల్ కార‌ణంగా ఏర్ప‌డితే ప‌సుపు, ఆకుప‌చ్చ రంగుల్లో, బైలిరూబిన్ కార‌ణంగా ఏర్ప‌డితే బూడిద రంగులో ఉండ‌వ‌చ్చు. వీటితో పాటు మ‌ద్యం ఎక్కువ‌గా తాగ‌టం కార‌ణంగా లేక క్రిముల ఇన్ ఫెక్ష‌న్ కారణంగా కూడా రాళ్లు ఏర్ప‌డ‌వ‌చ్చు.

సాధార‌ణంగా కాలేయం నుంచి విడుద‌ల అయిన పైత్య‌ర‌సం (బైల్ జ్యూస్‌) బైల్ గొట్టాలు అనే నాళాల ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఈ క్ర‌మంలో గాల్ బ్లాడ‌ర్ అనే చిన్న‌సంచీలో తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. ఆ త‌ర్వాత పేగులో ప్ర‌వేశిస్తుంది. బైల్ జ్యూస్ ప్ర‌వ‌హించే ఈ మార్గాల్లో ఎక్క‌డైనా రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అంటే బైల్ గొట్టాల్లో కానీ, గాల్ బ్లాడ‌ర్ లో కానీ చూడ‌వ‌చ్చు. కొన్ని సందర్బాల్లో కాలేయంలోనే రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. వీటితో పాటు జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని మ‌రో అనుబంధ గ్రంథి అయిన పాన్ క్రియాస్ లో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. క్రానిక్ పాన్ క్రియాటైటిస్ తో బాద‌ప‌డుతున్న‌ప్పుడు ఇలా జ‌రుగుతుంటుంది. కాల్సియం వంటి ల‌వ‌ణాలు బాగా పేరుకొని పోయిన‌ప్పుడు రాళ్లు ఏర్ప‌డ‌తాయి. చిన్న వయస్సులో కూడా ముఖ్యంగా పాన్‌ క్రియాస్‌ గ్రంథిలో కొన్ని రకాల ఆహార లోపాల మూలంగా కానీ, కొన్ని జన్యుపరమైన మార్పుల మూలంగా కానీ రాళ్లు ఏర్పడవచ్చు. దీనిని ట్రాపికల్‌ పాన్‌ క్రియాటైటిస్ అని పిలుస్తారు.
స‌రైన జీవ‌న‌శైలి లేక‌పోవ‌టం, ముఖ్యంగా ఆహార నియ‌మాలు పాటించ‌క పోవ‌టం, మ‌ద్య‌పానం వంటి దుర‌ల‌వాట్లు ఈ రాళ్లు ఏర్ప‌డ‌టానికి కార‌ణం అవుతుంటాయి. కొవ్వులు ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవ‌టం లేక ఊబ‌కాయం కార‌ణంగా శ‌రీరంలో కొలెస్ట‌రాల్ ఎక్కువ అవ‌టంతో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. బ‌రువు త‌గ్గిపోతున్న సంద‌ర్భంలో కూడా ఇదే ప‌రిస్థితి త‌లెత్తుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌లో స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు, క్రిముల కార‌ణంగా ఇన్ ఫెక్ష‌న్ ఏర్ప‌డినా కూడా రాళ్లు ఏర్ప‌డ‌వ‌చ్చు. పెద్దవారిలో రాళ్లు ఏర్ప‌డితే త‌ర్వాత త‌రంలో కూడా ఈ స‌మ‌స్య ఏర్ప‌డ‌టానికి అవ‌కాశం ఉంటుంది. మ‌ధుమేహ రోగుల‌కు ఈ ప్ర‌మాదం కాస్త ఎక్కువ అని చెప్ప‌వ‌చ్చు.
అందుచేత రాళ్లు చేరినప్పుడు అలాగే వదిలేయటం సరికాదు. సరైన వైద్య చికిత్స చేయించుకోవటం మేలు. 

కాలేయ సంరక్షణ.. మీ చేతుల్లో..!

మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం కాలేయం. దాదాపు 500 కు పైగా జీవన క్రియల్లో ఇది  పాలు పంచుకొంటుంది. ప్రధానంగా జీర్ణ వ్యవకస్థలో చురుకైన పాత్ర పోషిస్తుంది.
అయితే కాలేయాన్ని సంరక్షించుకోవటం అన్నది మన చేతుల్లోనే ఉన్నది. ముఖ్యంగా ఆహార నియమాలు, అంతకు మించి ఆరోగ్యకరమైన అలవాట్లు అని గుర్తించుకోవాలి.


ఆధునిక కాలంలో మద్యం తాగటం అన్నది ఫ్యాషన్ గా మారుతోంది. ఈ తాగుడుకి బానిస అయినవారిలో విష పదార్థాలు పోగు పడతాయి. ఇవి క్రమంగా కాలేయాన్ని చేరి అక్కడ తిష్ట వేస్తాయి. పేరుకు తగినట్లుగానే ఈ చెడు పదార్థాలు క్రమ క్రమంగా సజీవ కణజాలాన్ని తినేస్తుంటాయి. దీంతో కాలేయం పాడై పోయి సిర్రోసిస్ లేదా క్యాన్సర్ వంటి పరిస్థితికి దారి తీస్తుంది.

అందుకే కాలేయాన్ని సంరక్షించుకోవటంలో ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రధానం అని గుర్తించుకోవాలి. మద్యం తాగటం అన్నది ఎప్పటికైనా ప్రమాదకరమైన అలవాటుగా భావించాలి. అందుచేత మద్యం కు దూరంగా ఉండటం మేలు. అంతే గాకుండా భారత్ వంటి సాంప్రదాయిక సమాాజాల్లో కుటుంబంలోని పెద్దలు ఏ పనిచేస్తుంటే, పిల్లలు వాటిని అనుసరిస్తుంటారు. అందుచేత పెద్దలకు మద్యం తాగే అలవాటు ఉంటే అది  క్రమంగా పిల్లలకు సంక్రమిస్తుంది. దీంతో తర తరాలుగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. 

మన ఆరోగ్యం మన చేతిలో.. !

వినటానికి కొంత అతిశయోక్తి లా ఉన్నా..ఇది నూటికి నూరుపాళ్లు నిజం. మన ఆరోగ్యాన్ని కాపాడుకొనే శక్తి మనకే ఉంది. ఇందుకు చేయాల్సింది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం. ఉదాహరణకు మన కెరీర్ లో కానీ, పని తీరులో కానీ సమయ పాలనకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అంటే కేటాయించిన పని ని నిర్దిష్ట వేళల్లో పూర్తి చేయటం అన్న మాట.

అలాగే మనం ఆహారం తీసుకోవటం విషయంలోనూ ఇదే రకమైన సమయ పాలన్ని పాటించాలి. అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ తీసుకోవటం వంటి నాలుగైదు సెగ్మంట్ లుగా ఆహారం తీసుకోవటం చాలా మందికి అలవాటు. ఈ అలవాటుని జాగ్రత్తగా పాటించాలి. అంటే ప్రతీ రోజు దాదాపుగా అదే సమయానికి ఆ రకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు ప్రతీ రోజు ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేసి ఆఫీసుకి వెళ్లటం లేదంటే ఇంటి పని చేసుకోవటం అలవాటు ఉంటే అలాగే ఈ పనిని చేసుకోవాలన్న మాట.
దీని వల్ల క్రమం తప్పకుండా ఆహారం సక్రమంగా జీర్ణం అయి, జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. శరీరానికి క్రమం తప్పకుండా శక్తి అందుతుంది.


క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోండి..!




ప్రపంచ క్యాన్సర్ డే. అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు క్యాన్సర్ గురించి తెలుసుకొనే రోజు అన్నమాట.
వాస్తవానికి క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. ఇది సరి కాదు. శరీరంలో ఏదో ఒక భాగంలో అవాంఛనీయ కణజాలం పేరుకొనిపోయి కణితిగా మారుతుంది. ఇది క్రమేపి పెరిగిపోయి సజీవ కణజాలాన్ని తినివేస్తూ విస్తరించటాన్ని క్యాన్సర్ అంటారు. కణితి లు అన్నీ క్యాన్సర్ కాదని గుర్తించుకోవాలి. ఇది శరీరంలోని ప్రధానభాగాలైన ఎముకలు, గొంతు, వంటి భాగాలతో పాటు జీర్ణావయవాలైన కడుపు, కాలేయం, క్లోమం వంటి భాగాల్లో ఏర్పడవచ్చు.
జీర్ణ వ్యవస్థ లో ఏర్పడే క్యాన్సర్ కు ఇప్పుడు చికిత్సలు లభిస్తున్నాయి. ర్యాడికల్ సర్జరీ ద్వారా క్యాన్సర్ ఏర్పడిన భాగాన్ని తొలగించి చికిత్స చేయటానికి వీలవుతుంది. దీంతో పాటు అడ్వాన్సు డ్ దశల్లో కీమో థెరపీ, రేడియో థెరపీ లు చేయటంతో పరిష్కారం చేయవచ్చు. క్యాన్సర్ లో మొదటి , మద్య దశ వరకు చికిత్సలు సాధ్యం అవుతున్నాయి. మరీ ముదిరిపోయిన దశలో కూడా నాణ్యమైన శేష జీవితాన్ని అందించటానికి వీలవుతుంది.