-) కాలేయ వ్యాధులకు సంబంధించిన అవగాహన అందరికీ తప్పనిసరి. ముఖ్యంగా ప్రమాదకరమైన సిర్రోసిస్
గురించి అందరూ తెలుసుకోవటం మేలు.
-) ఈ వ్యాధి సోకినప్పుడు కాలేయం పరిణామం కుచించుకొని పోతుంది.
-) ఇటువంటి సందర్భాల్లో కాలేయం సాధారణ స్థితికి చేరటం సాధ్యం కాదు.
-) కాలేయ మార్పిడి మాత్ర మే దీనికి పరిష్కారం. భారత దేశంలో కాలేయ మార్పిడి కొన్ని చోట్ల జరుగుతున్నప్పటికీ,
సామాన్యులకు అందుబాటులో లేదు. ఈ శస్త్ర చికిత్సకు, మందులకు చాలా ఖర్చు కావటమే దీనికి కారణం.
-) వ్యాధి నివారణ కన్నా వ్యాధి నిరోధ చర్యలపై దృష్టి పెట్టాల్సి ఉంది.
-) కొన్ని సార్లు ఈ వ్యాధి క్యాన్సర్ కు దారి తీయవచ్చు.
ఈ వ్యాధికి నాలుగు కారణాల్ని గుర్తించవచ్చు.
1) మద్యపానం - మద్యం ద్వారా కాలేయం ఎక్కువగా పాడవుతుంది. మద్యపానాన్ని పూర్తిగా మానివేయటం
ఉత్తమ పరిష్కారం. లేదంటే వారానికి 10 ఔన్సులకు దీన్ని పరిమితం చేయాలి. అది కూడా ఒకే సారి కాకుండా
కొద్ది కొద్దిగా అనేక సార్లు తీసుకోవచ్చు.
2)
హెపటైటిస్ బీ వైరస్... దీన్ని హెచ్ బీ వీ అని పిలుస్తారు. ఈ వైరస్
వ్యాప్తి తో సిర్రోసిస్ సంక్రమిస్తుంది. చిన్నతనంలోనే టీకా వేయిస్తే
దీన్ని నిరోధించవచ్చు. వ్యాధి ముదిరినప్పుడు మందులతో
నివారించవచ్చు.అరక్షిత రక్త మార్పిడి ద్వారా కూడా వ్యాధి సోకవచ్చు.
సురక్షిత రక్తాన్ని మాత్రమే స్వీకరించటం మేలు.
3) హెపటైటిస్ సీ వైరస్.. దీన్ని హెచ్‌సీవీ అని పిలుస్తారు. కొన్ని మందుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించ వచ్చు.
బీ,
సీ రకం వైరస్ ల వ్యాప్తికి రక్తం మార్పిడి ఒక వాహకం. అందుచేత రక్తం
స్వీకరించేటప్పుడు ఈ వైరస్ లేనట్లుగా నిర్ధారించవచ్చు.
4) కొవ్వు కారకాలు.. రానున్న రెండు దశాబ్దాల్లో ఇది సర్వ సాధారణం
కానుంది. ఎంత ఆహారం తీసుకొంటున్నారు, ఎంత వ్యాయామం చేస్తున్నారు అనే దానిపై
ఇది ఆధార పడి ఉంటుంది. మనిషి ఎత్తు కి తగినట్లుగా బరువు ఉండేట్లు
చూసుకోవాలి. వ్యాయామం చేయటం, మద్యాపానానికి దూరంగా ఉండటం ద్వారా
కాలేయంలో కొవ్వు చేరకుండా నివారించవచ్చు.
ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా 95 శాతం కాలేయ వ్యాధులను నివారించవచ్చు. లేనిపక్షంలో కాలేయ మార్పిడి అవసరం అవుతుంది.