ఆధునిక కాలంలో అనేక అంశాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా జీవన శైలి బాగా మారుతోంది. కూర్చొన్న చోట నుంచి కదలకుండానే అన్నీ అమరిపోతుండటం చాాలా మార్పుల్ని తెచ్చిపెడుతోంది. అందులో ఏర్పడిన ముఖ్య సమస్యే ఇది.
జీర్ణ వ్యవస్థలో రాళ్లు ఏర్పడతాయి అంటే చాలామందికి అతిశయోక్తిగా అనిపిస్తుంది. కానీ, అనేక సందర్భాల్లో జీర్ణ వ్యవస్థలోని కొన్ని భాగాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. ఇటువంటి సందర్బాల్లో కూడా కడుపు నొప్పి వంటి అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యను శాస్త్రీయంగా గుర్తించి చికిత్స అందిస్తేనే రోగికి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ వ్యవస్థ లో కాలేయం నుంచి విడుదల అయ్యే పైత్య రసం(బైల్ జ్యూస్) లో బైలి రూబిన్, బైలి విరిడిన్ అనే వర్ణకాలు ఉంటాయి. ఇవి పేరుకొని పోయినప్పుడు లేక కొలెస్టరాల్ నిలిచి పోయినప్పుడు ఈ ద్రవ పదార్థాలు గట్టి పడి రాళ్లుగా మారతాయి. ఈ రాళ్లు కొలెస్టరాల్ కారణంగా ఏర్పడితే పసుపు, ఆకుపచ్చ రంగుల్లో, బైలిరూబిన్ కారణంగా ఏర్పడితే బూడిద రంగులో ఉండవచ్చు. వీటితో పాటు మద్యం ఎక్కువగా తాగటం కారణంగా లేక క్రిముల ఇన్ ఫెక్షన్ కారణంగా కూడా రాళ్లు ఏర్పడవచ్చు.
సాధారణంగా కాలేయం నుంచి విడుదల అయిన పైత్యరసం (బైల్ జ్యూస్) బైల్ గొట్టాలు అనే నాళాల ద్వారా బయటకు వస్తుంది. ఈ క్రమంలో గాల్ బ్లాడర్ అనే చిన్నసంచీలో తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. ఆ తర్వాత పేగులో ప్రవేశిస్తుంది. బైల్ జ్యూస్ ప్రవహించే ఈ మార్గాల్లో ఎక్కడైనా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే బైల్ గొట్టాల్లో కానీ, గాల్ బ్లాడర్ లో కానీ చూడవచ్చు. కొన్ని సందర్బాల్లో కాలేయంలోనే రాళ్లు ఏర్పడుతుంటాయి. వీటితో పాటు జీర్ణ వ్యవస్థలోని మరో అనుబంధ గ్రంథి అయిన పాన్ క్రియాస్ లో రాళ్లు ఏర్పడుతుంటాయి. క్రానిక్ పాన్ క్రియాటైటిస్ తో బాదపడుతున్నప్పుడు ఇలా జరుగుతుంటుంది. కాల్సియం వంటి లవణాలు బాగా పేరుకొని పోయినప్పుడు రాళ్లు ఏర్పడతాయి. చిన్న వయస్సులో కూడా ముఖ్యంగా పాన్ క్రియాస్ గ్రంథిలో కొన్ని రకాల ఆహార లోపాల మూలంగా కానీ, కొన్ని జన్యుపరమైన మార్పుల మూలంగా కానీ రాళ్లు ఏర్పడవచ్చు. దీనిని ట్రాపికల్ పాన్ క్రియాటైటిస్ అని పిలుస్తారు.
సరైన జీవనశైలి లేకపోవటం, ముఖ్యంగా ఆహార నియమాలు పాటించక పోవటం, మద్యపానం వంటి దురలవాట్లు ఈ రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంటాయి. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం లేక ఊబకాయం కారణంగా శరీరంలో కొలెస్టరాల్ ఎక్కువ అవటంతో రాళ్లు ఏర్పడుతుంటాయి. బరువు తగ్గిపోతున్న సందర్భంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంది. జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఉన్నప్పుడు, క్రిముల కారణంగా ఇన్ ఫెక్షన్ ఏర్పడినా కూడా రాళ్లు ఏర్పడవచ్చు. పెద్దవారిలో రాళ్లు ఏర్పడితే తర్వాత తరంలో కూడా ఈ సమస్య ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. మధుమేహ రోగులకు ఈ ప్రమాదం కాస్త ఎక్కువ అని చెప్పవచ్చు.
అందుచేత రాళ్లు చేరినప్పుడు అలాగే వదిలేయటం సరికాదు. సరైన వైద్య చికిత్స చేయించుకోవటం మేలు.