హెపటైటిస్ డే 2017..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ జూలై 28 న హెపటైటిస్ డే గా ప్రకటించటం జరిగింది. హెపటైటిస్ ను తరిమి కొట్టేందుకు అవగాహన కల్పించాలని పిలుపు ఇచ్చింది. ప్రమాద కరమైన సమస్యల్లో ఒకటిగా గుర్తించి అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.
ఇందులో ఐదురకాల వైరస్ లను గుర్తించవచ్చు. హెపటైటిస్ ఏ, బీ, సీ, డీ, ఈ అనే వైరస్ ల కారణంగాకామెర్లు సోకుతాయి. వీటిలో హెపటైటిస్ ఏ, ఈ అనే వైరస్ లు కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి. ఎక్కువమంది లో ఈ వైరస్ ఎక్కువగా హాని కల్గించక పోవచ్చు. హెపటైటిస్ బీ, సీ అనే వైరస్ లు మాత్రం కలుషిత లాలాజలం, కలుషిత రక్తం, కలుషిత వీర్యం ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. ఈ వైరస్ లు మాత్రం కాలేయానికి తీవ్రమైన హాని కల్గిస్తాయి.
సుదీర్ఘకాలం పాటు ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకొంటుంటే కాలేయ పాడవటం ఖాయం.మొదట్లో కాలేయ కణాల స్థానంలో కొవ్వుకణాలు పోగుపడి తర్వాత కాలంలో ఇవే స్థిరపడతాయి. వాస్తవానికి మద్యం ఎంత వరకు తాగవచ్చు అనే పరిమితి చెప్పటం కష్టం. ఇది ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉండవచ్చు. అందుచేత మద్యం తాగటం అనేది హానికరం అని గుర్తుంచుకోవాలి.
సమస్య తొలుత దశలో మందులతో పరిష్కారం సాధ్యం అవుతుంది. ముదిరిన దశలో మాత్రం ఆపరేషన్ విధానాలు అవసరం అవుతాయి.
ఆరోగ్యకరమైన అలవాట్లు, సక్రమమైన జీవన శైలిని పాటించటం ద్వారా ఈ సమస్యను అరికట్ట వచ్చు.