టీబీ అంటే ట్యూబర్ క్యులోసిస్ అని అర్థం. సాధారణంగా ఊపిరితిత్తులకు సోకే దీర్ఘకాలిక వ్యాధిగా దీని గురించి చాలా మందికి తెలుసు. బ్యాక్టీరియా క్రిముల సంక్రమించటంతో ఈ రోగం అంటుకొంటుంది. ఈక్రిములు ఊపిరితిత్తుల్లో తిష్ట వేసి శ్వాస ప్రక్రియలో ఇబ్బంది పెడుతుంటాయి. తీవ్రమైన దగ్గు, బరువు తగ్గిపోవటం వంటి లక్షణాలు గోచరిస్తాయి.
అటువంటి టీబీ కొన్నిసార్లు పేగులకు కూడా సోకుతుంది. ఊపిరితిత్తుల నుంచి ఇన్ ఫెక్షన్ పేగులకు వ్యాపించవచ్చు. లేదా టీబీ కి సంబంధించిన కళ్లె ను మింగినప్పుడు - ఆ క్రిములు పేగుల్లో ప్రవేశిస్తాయి. అప్పుడు అక్కడ వ్యాది ఏర్పడుతుంది. ఇది దీర్ఘ కాలికంగా పరిణమించవచ్చు. బరువు తగ్గిపోవటం, కడుపులో నొప్పి వంటి లక్షణాల్ని గమనించవచ్చు. జ్వరం కూడా వస్తుంటుంది. పేగుల్లో టీబీ సోకినట్లు గమనిస్తే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి. కచ్చితమైన మందుల్ని వాడటంతో పేగు టీబీ కి చికిత్స దొరకుతుంది. పేగు టీబీ అసాధారణ వ్యాధి కాదని గుర్తించుకోవాలి.

No comments:
Post a Comment