ఒక పద్దతికి అలవాటు పడితే అంతా అదే మార్గంలో వెళతారు. కానీ ఆ రూట్ లో వెళ్లేటప్పుడు సమస్య ఎదురవుతుందని తెలిస్తే, రూటు మార్చుకోవటం మేలు.
చేతులు శుభ్ర పరుచుకొనేందుకు సబ్బును వాడటం ఎప్పటినుంచో అలవాటైన విషయం. ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో ఈ అలవాటును కొనసాగించటం కొంత వరకు పర్వాలేదు. పూర్తిగా మంచిదని చెప్పలేం. కానీ బహిరంగ ప్రదేశాల్లో అంటే ఆఫీసుల్లో, హోటల్స్ లో మాత్రం సబ్బు వాడకం అంత సరి కాదు. కొంత మంది టాయిలెట్ కు వెళ్లి వచ్చాక ఈ సబ్బును ఉపయోగించారనుకొందాం. ఆ తర్వాత ఆ సబ్బుతో మనం చేతులు రుద్దుకొని, ఆహారం తీసుకోవటం మొదలెడితే సబ్బును ఆశ్రయించిన క్రిములు మన చేతి ద్వారా మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా వాష్ బేసిన్ దగ్గర కొంత మేర నీరు నిల్వ ఉండే చాన్సు ఉంది. అక్కడ నీళ్లలో సబ్బును ఉంచితే మాత్రం అది వ్యాధుల వ్యాప్తికి దారి తీస్తుంది. అందుచేత లిక్విడ్ హేండ్ వాష్ వాడుకోవటం ఉత్తమం. అందుచేత ఆఫీసులు, హోటల్స్ లో దీన్ని ఉపయోగించుకోవాలి. లేని పక్షంలో సొంతంగా ఒక వాష్ బాటిల్ కూడా ఉంచుకోవటం మేలు. అప్పుడు ఆయా ప్రదేశాల్లో మనం వీటిని వాడుకోవచ్చు.