సహజంగా ఏదైనా తప్పు జరిగిపోయాక, ఈ తప్పు ఎందుకు జరిగింది అనే దానిపై చర్చ నడుస్తుంది. ఇప్పుడు కూడా దీన్ని గుర్తు చేసుకొంటున్నాం.
ఇటీవల కాలంలో కాలేయ సమస్యలు ఎక్కువగా బయట పడుతున్నాయి. 40 సంవత్సరాలు దాటిన వారిలో ఇటువంటివి గమనిస్తున్నాం.. ఇన్ ఫ్లమేషన్, సిర్రోసిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు కనిపిస్తున్నాయి. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి గా దీన్ని చెప్పవచ్చు. ఇందులో సమస్యలకు అనేక కారణాలు కనిపిస్తాయి.
కానీ మద్య పానం ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. ఆల్కహాల్ తాగే అలవాటు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెరుగుతోంది. శ్రామిక వర్గాలు తమ శ్రమను మరిచిపోయేందుకు ఇదొక్కటే ఏకైక మార్గం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఉద్యోగ వర్గాల్లో ఇది తప్పనిసరి అలవాటుగా మారుతున్న ధోరణి కనిపిస్తోంది. ఆల్కహాల్ తాగటం తో అందులోని కెమికల్స్ శరీరంలోపలకు ప్రవేశించి విష పదార్థాలుగా మారతాయి. ఈ విష పదార్థాలు కాలేయంలో పోగు పడి వినాశనం సృష్టిస్తున్నాయి. దీంతో అనేక సమస్యలు ఉద్భవిస్తున్నాయి. ఇంతటి అనారోగ్యాన్ని తెచ్చుపెట్టుకొంటున్నది స్వయంగా ఆయా వ్యక్తులే. దీన్ని గుర్తించుకోవాలి. మద్య పానం అలవాటు ను పూర్తిగా వదులుకోవటం అత్యుత్తమ ఆరోగ్య అలవాటు గా గుర్తించుకోవాలి.

No comments:
Post a Comment