మహిళలు అనే కాదు, పురుషులు కూడా కొన్ని సార్లు చిన్నపాటి ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇందులో రక్త హీనత లక్షణాలు కూడా ఒకటి. సాధారణంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువ ఉంటుంది అనుకొంటుంటారు. అంతకు మించి మహిళలు దీన్ని ఎక్కువ నిర్లక్ష్యం చేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు.
రక్తంలో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటే దాన్ని రక్త హీనత గా చెబుతారు. హీమో గ్లోబిన్ అనేది ఈ ఎర్ర రక్త కణాల్లో ప్రధాన వర్ణక పదార్థం. దీంతో రక్తం తగ్గినట్లుగా భావిస్తారు. అదే రక్తహీనత. దీంతో చాలా నీరసంగా కనిపిస్తారు. చిన్న పాటి పనికే అలిసిపోయినట్లుగా కనిపిస్తారు. నిస్త్రాణత ఉంటుంది. గర్భవతులు, వృద్దుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. చాలా వరకు దీనికి పోషకాహార లోపమే కారణంగా భావిస్తు ఉంటారు. అందుచేత ఆహారాన్ని సమృద్దిగా తీసుకోమని చెబుతారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ అన్ని సార్లు పోషకాహార లోపమే రక్త హీనత కు కారణం కాకపోవచ్చు. ఎర్ర రక్త కణాలు శిథిలం కావటంలో సమస్య కానీ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సమస్య కానీ ఉండవచ్చు. అటువంటప్పుడు పోషకాహార లోపం అనుకొని నిర్లక్ష్యం చేస్తే సమస్య తప్పదు. అందుచేత రక్త హీనత ఉన్నప్పుడు సరైన వైద్య సలహా తీసుకొని పరీక్షలు చేయించుకొంటే మంచిది. ముందస్తు జాగ్రత్తతో ఇబ్బందుల్ని తప్పించుకోవచ్చు.

No comments:
Post a Comment