ఈ సామెత తెలుగులో చాలా మందికి తెలుసు. పచ్చ కామెర్లు వస్తే కళ్లు పచ్చగా ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తి చూసే వన్నీ పచ్చగా ఉంటాయని దీని అర్థం. కానీ వాస్తవానికి ఇది తప్పు. కామెర్ల విషయంలో అవగాహన లేకుండా ఇటువంటివి ప్రచారం చేస్తుంటారు.
వాస్తవానికి కామెర్లు అంటే ఒక వ్యాధి కాదు. ఇది సమస్య రూపం మాత్రమే. కాలేయంలో రక్త కణాల్లోని ఎర్ర రక్త కణాల విచ్చిన్నం జరుగుతుంది. దీని కారణంగా బైలి రూబిన్ అనే వర్ణకం రూపొంది, పేగుల్లోకి వెళుతుంది. ఏదైనా కారణాలతో ఈ బైలిరూబిన్ కాలేయంలోనే పోగు పడితే దాన్ని కామెర్లుగా అభివర్ణిస్తారు. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తాయి. వైరస్ ఇన్ ఫెక్షన్ కావచ్చు, సరైన జీవన శైలి లేకపోవటం కావచ్చు, దురలవాట్లు కావచ్చు.. కానీ కామెర్ల కు కారణం తెలిసినప్పుడే అది ఎటువంటి రకమో అర్థం అవుతుంది. అప్పుడే దీనికి చికిత్స చేయటం సులువు అవుతుంది.
ఈ కామెర్లు కారణంగా శరీరంలోని అనేక భాగాలు పచ్చగా మారతాయి. అందులో కళ్లు కూడా ఒకటి. కళ్ల దగ్గర ఉండే తెల్ల పాప పచ్చగా మారుతుంది. చాలా సార్లు ఇటువంటి లక్షణాల్ని బట్టే కామెర్లును గుర్తిస్తారు. అంత మాత్రం చేత ఆ వ్యక్తి చూసే దృశ్యం బాగానే ఉంటుంది. కంటి చూపు ద్వారా పచ్చగా కనిపించటం ఉండదు. ఇది వ్యంగం కోసం పుట్టిన సామెత తప్ప, ఆరోగ్య పరంగా ప్రాధాన్యం లేదు. అందుచేత వ్యంగంగా వ్యాఖ్యానించటానికి మాత్రం దీన్ని వాడుకోవచ్చు.
కామెర్ల గురించి అవగాహన ఉంటే సక్రమంగా చికిత్స తీసుకోవటానికి వీలవుతుంది. చుట్టుపక్కల వారికి కామెర్లు ఉంటే అప్రమత్తం చేయటానికి వీలవుతుంది.

No comments:
Post a Comment