...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

అమీబియాసిస్ కు అరవై కారణాలు

మన జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోనప్పుడు అమీబియాసిస్ వచ్చే అవకాశం ఉంది. నోటి ద్వారా కడుపులోకి తీసుకునే ఆహారం కారణంగానే ఈ వ్యాధి వస్తుంది. సహజంగా కలరాకు దారితీసే లక్షణాలన్నీ అమీబియాియాసిస్ కు దారితీస్తాయి. తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవడం ద్వారా అమీబియాసిస్ ను నియంత్రించవచ్చు.

                 పొగత్రాగడం, ఆల్కహాల్ సేవనం, గుట్కాలు, జర్దాలు, అమీబియాసిస్ ను మరింత పెంచుతాయి. పైగా కడుపులో అల్సర్లు రావడానికి కారణమౌతాయి.అమీబియాసిస్ లో పేగులు బాగా దెబ్బతింటాయి. దీని వల్ల దీర్ఘకాలం పాటు తిన్న ఆహారం జీర్ణం కాకుండా అలాగే ఉండిపోయి, సూక్ష్మజీవులకు నివాసస్థానంగా మారుతుంది. సూక్ష్మజీవులు పెరిగేకొద్దీ వ్యాధి తీవ్రత బాగా పెరుగుతుంది. 

కలరా వస్తే కలవరపడొద్దు

సాధారణంగా విరేచనాలు అవుతున్నాయని రోగులు డాక్టర్లకు చెబుతుంటారు. అయితే అన్ని విరేచనాలు ఒకేలా ఉండవు. అవి ఎప్పట్నుంచి అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి. విరేచనాల రంగు, వాసన ఎలా ఉందనే విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. వీటిని బట్టే డాక్టర్లు రోగికి చికిత్స విధానాన్ని నిర్ణయించగలుగుతారు. విరేచనాలకు ముందు రోగి ఏం తిన్నాడు, ఏ సమయంలో తిన్నాడనేది కూడా కలరా అవునో, కాదో నిర్థారించుకోవడానికి సహాయపడుతుంది.

                     కేవలం విరేచనాలు తగ్గించడానికి మందులివ్వడానికి ముందే.. రోగి గుండెపోటు, రక్తప్రసరణ సరిగ్గా ఉందో లేదో డాక్టర్లు అంచనా వేస్తారు. విరేచనాలు ఎలా అవుతున్నాయనే విషయాన్ని బట్టి.. అది కేవలం విరేచనాలో కాదో నిర్థారణకు వస్తారు. విరేచనాలతో పాటూ మూత్రం పడుతుంటే చాలా అపాయకరమైన పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. ఇక మూత్రం అయిన తర్వాత కూడా విరేచనాలు ఆగకపోతే అది మరింత ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయొచచ్చు. కలరా వచ్చినప్పుడు కలవరపడకుండా డాక్టర్ని సకాలంలో సంప్రదించడం ఉత్తమం.

అజీర్తే విరేచనాలకు మూలం

స్ప్రూ అనే విరేచనాల వ్యాధిలో అమిత దుర్వాసన ఉంటుంది. దీర్ఘకాలం విరేచనాలు ఉండటం వల్ల రోగి బరువు కోల్పోతాడు. ఇనుము వంటి పోషక పదార్ధాలు ఒంటికి వంటబట్టకపోవడంతో రోగి క్షీణించి పాలిపోతాడు. పాలు, గుడ్లు వంటివి సరిపడని శరీర తత్వం ఉన్న వ్యక్తులు జీర్ణశక్తి బాగా తక్కువగా ఉన్నప్పుడు అవి తీసుకుంటే.. తీవ్రమైన ఎలర్జీ లక్షణాలు వచ్చి విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

                         పేగులోపల విపరీతంగా పూసి పుళ్లు పడిపోయినప్పుడు అల్సరేటివ్ కోవైటిస్ అంటారు. రక్తంతో కూడిన విరేచనం, కడుపులో నొప్పి, జ్వరం ఉంటున్నప్పుడు పేగుల్లో ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని గమనించాలి. ఎపెండిసైడిటిస్ అనే కడుపు నొప్పితో కుడివైపుగజ్జల్లో నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లివర్ జబ్బుతో బాథపడే వ్యక్తికి కుడివైపు డొక్కల్లో నొప్పి వస్తుంది. పేగుల్లో ఏర్పడే తేడాల వల్ల విరేచనాలు, కడుపు నొప్పి వస్తాయి. 

కలరాతో జాగ్రత్త..!

ఆహారం ద్వారా, నీటిద్వారా కడుపులోకి చేరే హానికారక బ్యాక్టీరియా కారణంగా కలరా వస్తుంది. ఈ బ్యాక్టీరియా విరేచనాల వ్యాధికి కారణం అవుతాయి. కలరా ఊరంతా వ్యాపించినప్పుడు అతిసారం అంటారు. ఊళ్లో కలరా కేసులు ఉన్నాయని తెలిసినప్పుడు తక్కిన జనాభా అంతా కలరా వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. మానసిక వ్యాధులు, నాడీ సంబంధ వ్యాధులు కూడా ఈ వ్యాధి రావడానికి కారణం అవుతాయి.

        అమీబిక్ డిసెంట్రీ వంటి వ్యాధులు, పేగుల్లో టీబీ సూక్ష్మజీవుల వల్ల ఏ్పడే విరేచనాల వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశం ఉంది. జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి రావచ్చు. శరీరానికి సరిపడని ఆహారపదార్ధాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి స్థితి వస్తుంది. పేగుపూత, క్రిమిసంహారకాలు పొరపాటున ఆహారం ద్వారా కడుపులోకి వెళ్లడం వల్ల కూడా కలరా వస్తుంది. 

ఎసిడిటీకి కారణాలెన్నో..!

కడుపులో మంటకు ఎసిడిటీయే కారణమని మనందరికీ తెలుసు. అతిగా ఆహారం తీసుకున్నా.. తీసుకోవాల్సినంత ఆహారం తినకపోయినా ఎసిటిడీ వస్తుంది. కాబట్టి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ప్రధానం. కడపులో మంట కారణంగా పనిచేయగల శక్తి తగ్గిపోతుంది. పుల్లటి తేన్పులు వస్తాయి. నోరు చేదుగా ఉంటుంది. పొట్ట బరువెక్కినట్లవుతుంది. కడపులో ఏదో ఉండ చుట్టినట్లు అనిపిస్తుంది.

                    గొంతులో, గుండెలో మంటగా అనిపిస్తుంది. అన్నం సహించదు. మలబద్ధకంతో పాటు మలం పచ్చగా మారుతుంది. విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఒక్కోసారి ఆ నొప్పి తగ్గడానికి  మందులు  మింగడం వల్ల మరింత ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది.  వికారంగా ఉంటుంది. గుండెల్లో, ఛాతిలో నొప్పి వచ్చి గుండెపోటు వస్తుందేమోనన్న భయం కలుగుతుంది. భయం కారణంగా అలసట, కడపులో గడబిడ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. 

కడుపు డస్ట్ బిన్ చేయొద్దు

మనకు వచ్చే వ్యాధుల్లో చాలావరకు తినే ఆహారం వల్లే వస్తాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కడుపులోకి తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉంటే.. మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని పెద్దలు చెబుతారు. శుభ్రత లేని ఆహారం తింటే వ్యాధులు చుట్టబెడతాయి. ముందుగా కడుపు ఉబ్బరంతో మొదలైన వ్యాధులు ముప్పేట దాడి చేస్తాయి. కడుపు ఉబ్బరానికి ఆరోజు తిన్న ఆహారమే కారణం కాదు.. కొన్నిరోజులుగా అశుభ్రమైన ఆహారం తినడమే అసలు కారణం.
     మనం బయట తినే తిళ్లను కడుపు అరాయించుకోలేకపోతే.. అవి లోపలే పేరుకుని కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయి. కడుపు ఉబ్బరం పెరిగి మలబద్ధకంగా మారుతుంది. కాబట్టి తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హోటల్ ఫుడ్, చిరుతిళ్లు తినేముందు అవి ఎలాంటి వాతావరణంలో తయారుచేస్తాయో గమనించడం చాలా ముఖ్యం. లేకపోతే మనం తినే చిన్నమొత్తం ఆహారం.. పెద్దమొత్తంలో అనారోగ్యానికి కారణమౌతుంది. కాబట్టి బయట చిరుతిళ్లు తినేవారూ పారాహుషార్. 

కడుపు మంట - అజీర్తి

ఒక్కోసారి విపరీతమైన ఆకలి వేస్తుంది. వడ్డించింది సరిపోదేమో అనిపిస్తుంది. కానీ కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకో ముద్ద తిందామంటే  పొట్ట బరువెక్కిపోతుంది. ఇంక మెతుకు కూడా దిగని పరిస్థితి వస్తుంది. సరే అని చెయ్యి కడుక్కుంటే.. మళ్లీ కాసేపటికే ఆకలి వేస్తుంది. తట్టుకోలేక ఏది కనిపిస్తే అది తినేద్దాం అనిపిస్తుంది. ఇదే అజీర్తి కథ.
           ఇప్పటిదాకా వేసింది నిజమైన ఆకలి కాదు. మాయా ఆకలి. అది కడుపులో మంట. కడుపులోకి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా అలాగే ఉండిపోవడం వల్ల అజీర్తి చేస్తుంది. ఆహార పదార్థాల ఆమ్లీకరణ తర్వాత చిన్నపేగుల్లో శోషణ జరుగుతుంది. తర్వాత పెద్దపేగుల ద్వారా మూత్రపిండాల్లోకి వ్యర్థపదార్థాలు చేరతాయి. అయితే శోషణ సరిగా జరగకపోతే అజీర్తి వస్తుంది. 

అన్నం తినకపోవడం.. దీర్ఘకాలిక వ్యాధి

వ్యక్తిగత అలవాట్లను బట్టి జీవితాంతం వెంటాడే సమస్య గ్యాస్ ట్రబుల్. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీన్నేగ్యాస్ట్రైటిస్ అని కూడా అంటారు. గ్యాస్ట్రైటిస్ లో పేగుల్లోపలి పొరలు వాచిపోతాయి. అన్నం సహించకపోవడం, ఆకలి లేకపోవడం, వికారం, విరోచనాలు వంటివి గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. సాయంకాలం కంటే పొద్దున పూటే ఈ బాథలు ఎక్కువగా ఉంటాయి. పేగుపై పూత అంటే గ్సాస్ట్రిక్ అల్సర్ ఉన్నా కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. ప్యాంక్రియాజ్ క్యాన్సర్ వచ్చినప్పుడు, లివర్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
            రోజువారీ తినే అన్నమా కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఆ అన్నం తినే అలవాట్లను బట్టి కూడా దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలను అంచనా వేయొచ్చు. ఎప్పుడో ఓసారి అన్నం మానేస్తే పర్వాలేదు కానీ.. తరచుగా అన్నం తినాలని అనిపించకపోతే మాత్రం తప్పనిసరిగా అనునామనించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ అన్నం తినాలనిపించకపోవడం టీబీ, క్యాన్సర్, గ్యాస్ట్రైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

అన్నం సహించట్లేదా..?

అన్నం వాసన తెలియకపోవడం, అీన్నపు రుచి తెలియకపోవడం, ఆస్వాదించలేకపోవడం, ఒక రుచికి, మరో రుచికి తేడా తెలియక పోవడం, నోటిలోపల అసహ్యకరమైన ఏదో రుచి ఉండటం వంటివన్నీ.. అన్నం సహించట్లేదనడానికి సంకేతాలు. నోటి దుర్వాసన, మన ఊపిరి ఇతరులకు అసహ్యం కలిగిస్తుందనే భయంతో శ్వాస బిగపట్టడం కూడా దీని లక్షణాలే.
       రక్తహీనత కారణంగా రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిపోయి ఆ ప్రభావం ఎర్రరక్తకణాలతో పాటు జీర్ణకోశవ్యవస్థ మీద కూడా ఉంటుంది. దీని వల్ల ఆక్సిజన్ శరీరానికి అందడం తగ్గిపోయి జీవక్రియలో లోపాలు ఏర్పడతాయి. వీటితో పాటు మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. ఆకలి మందగించడం, వికారం, మలబద్ధకం వంటి వన్నీ రక్తహీనత లక్షణాలే. 

కడుపు మంటే.. పేగుపూత

మనకు చాలా కోపం వచ్చినప్పుడు తెలియన ఆందోళన, అసంతృప్తికి గురవుతాం. కొంతమందికి కోపం వస్తే వాళ్లేం చేస్తున్నారో కూడా వారికే తెలియదు. అనవసర ఆందోళన, అసంతృప్తి కోపంతో పాటు కడుపు మంటకు కూడా కారణమౌతాయి. కడుపుమంట దీర్ఘకాలం ఉంటే అది పుళ్లుగా ఏర్పడి.. పేగుపూతకు దారితీస్తుంది. నాలికపూస్తే ఎర్రగా అయి మంట పెట్టినట్లే.. పేగుల్లో యాసిడ్ ఎక్కువైతే ఎర్రగా మారి పొక్కిపోతాయి.
             పేగుపూత ఉన్నవారికి పొట్ట మీద చెయ్యి వేస్తే నొప్పిగా ఉంటుంది. కడపు లోపల్నుంచి విపరీతమైన నొప్పి ఉంటుంది. కొంతమందికి ఆహారం తీసుకుంటే నొప్పి పెరుగుతుంది.  భోజనం చేయగానే అనీజీగా ఉంటుంది. వికారం వాంతి వస్తున్నట్లు ఉంటుంది. భోజనం కాస్త ఆలస్యమైతే కడుపులో ఏదో అవుతున్నట్లుగా ఉంటుంది. కొంచెం తినగానే కడపు నిండటం, మళ్లీ వెంటనే ఆకలి వేయడం పేగుపూత లక్షణాలు. పేగుపూత లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.

బయటి తిళ్లతో జాగ్రత్త..!

బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో టైం పాస్ కోసం బయటి తిళ్లు తినడం మనలో చాలా మందికి ఉండే అలవాటు. అయితే మనం తీసుకునే ఆహారపదార్ధాలు శుభ్రంగా ఉన్నాయో.. లేదో చూసుకోకపోతే అవి గ్యాస్ట్రైటిస్ కు దారితీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 
1. సాధారణంగా రైలు, బస్సు ప్రయాణాల సమయంలో బయటి ఆహారపానీయాలు తీసుకుంటాం. వీటిలో చాలావరకు అపరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయబడతాయి. 
2. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు విందు భోజనంలో కూడా ఆహారం, పానీయాలు తినడం, తాగడం తప్పనిసరి. ఇక్కడ ఆహారం కూడా ఎంతో కొంత కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. 
3. హోటళ్లలో, హాస్టళ్లలో, మిర్చిబళ్ల దగ్గర తినే ఆహారం ఎక్కువశాతం కలుషితమై ఉంటుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ రావచ్చు. 
4. ఇంట్లో తాగే నీరు కూడా పంచాయతీ, మున్సిపాలిటీ సప్లై చేసే నీళ్లు ఎంతవరకు శుభ్రంగా ఉంటుందో చెప్పడం కష్టమే. కలుషిత నీరు తాగినా గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సుంది.  
5. గోళ్లల్లో ఉండే మట్టి కూడా తినే ఆహారం ద్వారా పేగుల్లోకి చేరి రోగాలకు దారితీస్తుంది.

వామ్మో కడుపునొప్పి..!

కడుపునొప్పి రాని మనిషంటూ ఉండడు. ఆమాటకొస్తే కడుపులోకి ఆహారం తీసుకునే సమస్త జంతువులు కడుపునొప్పికి మినహాయింపు కాదు. పేగుల లోపల అలజడి కలిగినప్పుడు కడుపు తరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. పేగుకు సంబంధించిన వ్యాధులతో పాటు లివర్ మరియి స్ప్లీన్ వ్యాధులు, పాంక్రియాజ్, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు , గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా పేగుల్లో అలజడికి కారణమౌతాయి.
      తరచూ ఆకలి మందగించడం, వాంతి, వికారం, కడుపులో బరువుగా ఉండటం, కడుపు నొప్పిగా ఉండం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటే.. గ్యాస్ట్రయిటిస్ ఉందేమో పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. వాంతి అయినప్పుడు కొద్దిగా నెత్తుటి జీర కనిపించినా, నెత్తురు పడినా అది తప్పకుండా గ్యాస్ట్రయిటిస్ అయ్యే అవకాశం ఉంటుంది. పొట్టలోపల సూక్ష్మజీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ఈ గ్యాస్ట్రయిటిస్ రావడానికి ప్రధాన కారణం. 

ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రస్తుత ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎక్కువగా డబ్బు సంపాదించేవారు కాదు.. అందరికంటే ఆరోగ్యంగా ఉన్నవారే. కాలుష్యం పెరిగిపోతున్న నేటిరోజుల్లో.. జీవనశైలిలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వేగవంతమైన జీవనశైలితో ఆహారపు అలవాట్లు, నిద్ర సమయంలో కూడా తేడాలు ఉంటున్నాయి. ఈ తేడాలు ఓ పరిమితి దాటనంత వరకు ఓకే. కానీ ఏమాత్రం పరిమితి దాటినా మన అలవాట్లే రోగాలకు ఆహ్వానం పలికినట్లవుతుంది.
        ఎలాంటి జీవనశైలి ఉన్నవారికి అయినా సరిపోయే విధంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవచ్చు. కానీ అవి తప్పకుండా ఆరోగ్యకరమైన అలవాట్లయి ఉండాలి. మన జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయంలో మనం డాక్టర్ల సలహాలు తప్పక పాటించాలి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా.. తర్వాతి కాలంలో అదే పెద్ద జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మన ఆరోగ్య పరిరక్షణ మన ఆహారపు అలవాట్లలోనే ఉందన్న సంగతి గుర్తుంచుకోవాల్సిన అసరం ఉంది.