ఒక్కోసారి విపరీతమైన ఆకలి వేస్తుంది. వడ్డించింది సరిపోదేమో అనిపిస్తుంది. కానీ కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకో ముద్ద తిందామంటే పొట్ట బరువెక్కిపోతుంది. ఇంక మెతుకు కూడా దిగని పరిస్థితి వస్తుంది. సరే అని చెయ్యి కడుక్కుంటే.. మళ్లీ కాసేపటికే ఆకలి వేస్తుంది. తట్టుకోలేక ఏది కనిపిస్తే అది తినేద్దాం అనిపిస్తుంది. ఇదే అజీర్తి కథ.
ఇప్పటిదాకా వేసింది నిజమైన ఆకలి కాదు. మాయా ఆకలి. అది కడుపులో మంట. కడుపులోకి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా అలాగే ఉండిపోవడం వల్ల అజీర్తి చేస్తుంది. ఆహార పదార్థాల ఆమ్లీకరణ తర్వాత చిన్నపేగుల్లో శోషణ జరుగుతుంది. తర్వాత పెద్దపేగుల ద్వారా మూత్రపిండాల్లోకి వ్యర్థపదార్థాలు చేరతాయి. అయితే శోషణ సరిగా జరగకపోతే అజీర్తి వస్తుంది.
No comments:
Post a Comment