కాలేయ మార్పిడి..అవగాహన
జీర్ణ వ్యవస్థ లో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. జీర్ణాశయానికి కుడివైపున ఇది అమరి ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయటంలో కీలకపాత్ర పోషించటంతో పాటు ప్రోటీన్ సంశ్లేషణ, ఔషద వినియోగం, మలినాల విసర్జన వంటి అనేక జీవన క్రియల్లో ఉపయోగపడుతుంది.
అనేక సార్లు కాలేయం చెడిపోవటంతో దాన్ని పూర్తిగా మార్చాల్సి వస్తోంది. అందుచేత కాలేయాన్ని సేకరించి అమర్చాల్సి ఉంటుంది. దీన్ని కాలేయ మార్పిడి అంటారు.
అనేక సార్లు కాలేయం చెడిపోవటంతో దాన్ని పూర్తిగా మార్చాల్సి వస్తోంది. అందుచేత కాలేయాన్ని సేకరించి అమర్చాల్సి ఉంటుంది. దీన్ని కాలేయ మార్పిడి అంటారు.
కాలేయాన్ని గ్రహీత శరీరంలో అమర్చాక.. అది అక్కడ నెమ్మదిగా ఇమిడిపోతుంది. ఇతర అవయవాల నుంచి సహాయం తీసుకొని కుదురుకొంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా తన విధులు నిర్వర్తించటం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుంది. సాధారణంగా శరీరంలోకి ఇతరుల అవయవాలు ప్రవేశిస్తే.. దేహం దాన్ని తిరస్కరిస్తుంది. ఇటువంటి పరిస్థితి చోటుచేసుకోకుండా ఉండేందుకు ఇమ్యునో సప్రెసివ్ మందులు వాడాల్సి ఉంటుంది. తక్కువ ఇమ్యూనోజెనిక్ సామర్థ్యం కల అవయవంగా కాలేయాన్ని చెబుతారు. అందుచేత ఎక్కువ కాలం ఈ మందుల్ని వాడుతున్నా..చౌకగానే సాధ్యం అని గుర్తించుకోవాలి. ఇటువంటి ఆపరేషన్ లలో తరచుగా వచ్చే సైడ్ ఎఫెక్టు గా ఇన్ ఫెక్షన్ ను చెబుతారు. అందుచేత కాలేయ మార్పిడికి ముందుగానే వైరల్, బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్ సోకకుండా టీకాల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కాలేయ మార్పిడి ఆపరేషన్ లు విజయవంతం అవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇటువంటి రోగులు ..మిగిలిన రోజుల్లో అవసరం అయినప్పుడల్లా వైద్యుల సాయం తీసుకోవాలి.
మొత్తం మీద కాలేయ మార్పిడికి సంబంధించిన అవగాహన సమాజంలో బాగా పెరగాల్సి ఉంటుంది. కాలేయ వ్యాధుల చికిత్సలో అనేక మెడికల్, సర్జికల్ విధానాలు ఉన్నాయని గుర్తించాలి. వీటిలో కాలేయ మార్పిడి కీలకమైందని తెలుసుకోవాలి. దీనిపట్ల అపోహలు తొలగించాల్సి ఉంది. మరణం తర్వాత అవయవాలు దానం చేసే కల్చర్ పెరగాలి. ఇందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అదే సమయంలో సరైన చట్టాలు చేయటం ద్వారా ప్రభుత్వాలు కూడా అనుమతించాలి. సుదీర్ఘ రోగాల్ని నయం చేసే క్రమంలో అవయవ మార్పిడి అనేది ఒక సమర్థవంత మైన విధానంగా ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలి.
No comments:
Post a Comment