రక్తం అంటే ఎవరికైనా భయం కలుగుతుంది. ముఖ్యంగా వాంతి అయినప్పుడు అందులో రక్తం కనిపిస్తే గబుక్కున భయం వేస్తుంది. జీర్ణ వ్యవస్థ లోని ఎగువ భాగాలైన ఆహార వాహిక, జీర్ణాశయం, పేగుల్లో ఏర్పడే సమస్యల కారణంగా ఈ రక్తం పడే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఉన్నా కూడా రక్తం పడుతుంది.
జీర్ణ వ్యవస్థ లో సమస్య కారణంగా రక్తపు వాంతులు కావటానికి అనేక కారణాలు కనిపిస్తాయి. విపరీతమైన కడుపు నొప్పి ఉండి తర్వాత వాంతులు అయితే అల్సర్ గా భావించాలి. అదే వాంతిలో రక్తం, ఆహారం కలిసి పడుతుంటే క్యాన్సర్ గా అనుమానించాలి. కాలేయం పాడైతే మాత్రం రక్తపు వాంతులతో పాటు కామెర్లు కూడా ఉండవచ్చు. రక్తపు వాంతులు అయినంత మాత్రాన కంగారు పడాల్సిన పని లేదు. ముఖ్యంగా రోగికి ఈ విషయంలో ధైర్యం చెప్పాలి. ఆధునిక వైద్య శాస్త్రంలో చక్కని వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు దొరుకుతున్నాయి. ఈ సమస్యకు కూడా వ్యాధి నిర్ధారణ ద్వారా చికిత్సను ఎంచుకోవాల్సి ఉంటుంది. మందులతో తగ్గితే సరే లేదంటే ఎండోస్కోపీ విధానంలో ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు. నిపుణులైన వైద్యుల్ని సంప్రదిస్తే మెరుగైన చికిత్స తీసుకోవచ్చు.

No comments:
Post a Comment