ప్రతీ ఏటా ఫిబ్రవరి 4 న ప్రపంచ క్యాన్సర్ రోజు గా జరుపుకొంటారు. ఈ సందర్భంగా కడుపు క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకొందాం..
జీర్ణ వ్యవస్థ లోని ప్రధాన భాగాల్లో కడుపు ఒకటి. ఇక్కడ ఆహారం మెత్తటి గుజ్జుగా మారి జీర్ణ ప్రక్రియ ఊపందుకొంటుంది. ఇక్కడ క్యాన్సర్ ఏర్పడితే దాన్ని జీర్ణ కోశ క్యాన్సర్ ( స్టమక్ క్యాన్సర్ లేక గ్యాస్ట్రిక్ క్యాన్సర్) అని పిలుస్తారు. ఇతర భాగాలైన ఆహార వాహిక, పేగు, రెక్టమ్, కాలేయం, క్లోమం లలో కూడా క్యాన్సర్ ఏర్పడవచ్చు.
కడుపు క్యాన్సర్ కు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అతి వేడి ఆహారం తినటం, ఉప్పు అధికంగా ఉండే సముద్రపు ఆహారం తినటం, వేపుళ్లు తో కూడిన మాంసాహారం తినటం వంటి వాటి వల్ల ఈ క్యాన్సర్ తలెత్తుతుంటుంది. పొగ తాగటం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే ఈ వ్యాధి వచ్చేచాన్సులు ఎక్కువ. హెలికో బ్యాక్టర్ పైలోరి వంటి సూక్ష్మ క్రిముల ఇన్ ఫెక్షన్ తో కడుపు చెడి క్యాన్సర్ కు దారి తీయవచ్చు.
కుటుంబంలో ఇతరులకు చిన్న వయస్సులోనే క్యాన్సర్ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకు వచ్చేచాన్సు ఉంటుంది. పొగ తాగటం, మద్యపానం వంటి దురల వాట్లు ఉంటే క్యాన్సర్ కు దారి తీయవచ్చు. స్త్రీలతో పోలిస్తే పురుషులకు ఎక్కువ అవకాశం . ఆధునిక జీవన శైలితో జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ వ్యాయామానికి దూరంగా ఉంటే జీర్ణ కోశ సమస్యలు తలెత్తి క్యాన్సర్ కు దారి తీయవచ్చు.
ఆహారం మింగటంలో ఇబ్బంది, ఏమీ తినకుండానే కడుపు నిండుగా ఉండటం, కొద్ది పాటి ఆహారం తిన్నా కానీ నొప్పి, అజీర్తిగా ఉండటం గమనించవచ్చు. కడుపులో ఎగువ భాగం, మధ్య భాగం మధ్యలో గడబిడగా ఉండి అప్పుడప్పుడు నొప్పి వస్తుంటుంది. మలంలో రక్తం పడుతుంటుంది. ఇది నల్లగా కానీ, ఎర్రగా కానీ ఉండవచ్చు. చేతితో తడిమి చూసినప్పుడు కణితులు తగలవచ్చు. నీరసం, నిస్త్రాణ పెరిగిపోతాయి ఈ లక్షణాలతో పాటు కొన్నిసార్లు కామెర్లు, కాలేయవాహిక ఇన్ ఫెక్షన్ వంటివి కలిసి కనిపిస్తుంటాయి.
జీర్ణ వ్యవస్థ లో సమస్య ఏర్పడినప్పుడు ఎండో స్కోపీ పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తుంటారు. ఎక్సురే, రక్త పరీక్ష, బయాప్సీ అవసరం అవుతుంటుంది. అల్ట్రా సౌండ్ స్కానింగ్, సీటీ స్కాన్ ల ద్వారా క్యాన్సర్ ఏ దశలో ఉన్నదీ తెలుసుకొనేందుకు వీలవుతుంది.
తొలి దశలో చికిత్సకు ఎండో స్కోపీ విధానాల్నిఅవలంబిస్తారు. దీని ద్వారా కణితిని తొలగించి చికిత్స చేసేందుకు వీలవుతుంది. వ్యాధి ముదిరితే ర్యాడికల్ ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. తర్వాత దశలో కీమో థెరపీ, రేడియో థెరపీ అవసరం అవుతుంటాయి.
సరైన జీవన శైలిని పాటించటం, పోషకాహారం తీసుకొంటూ వ్యాయామం చేస్తుండటం మంచిది. దురల వాట్లకు దూరంగా ఉంటే క్యాన్సర్ కు దూరంగా ఉండవచ్చు.

No comments:
Post a Comment