ఇటీవల కాలంలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ప్రధానంగా పాన్ క్రియాస్ గ్రంథిలో వాపు రావటం, రాళ్లు ఏర్పడటం వంటి సమస్యల్ని చెప్పవచ్చు.
వాస్తవానికి పాన్ క్రియాస్ అంటే జీర్ణ వ్యవస్థ లో ప్రధాన అనుబంధ అవయవం. ఆహారాన్ని జీర్ణం చేయటానికి అవసరమైన ఎంజైమ్ లతో పాటు, గ్లూకోజ్ ను క్రమబద్దం చేసే హార్మోన్‌లను పాన్ క్రియాస్ స్రవిస్తుంది. పాన్ క్రియాస్ లో ఏర్పడే ప్రధాన సమస్యల్లో రాళ్లు ఏర్పడటం ముఖ్యమైనది. అవాంఛిత పదార్థాలు పేరుకొని పోయి రాళ్లుగా ఏర్పడుతాయి. దీన్ని క్రానిక్ పాన్ క్రియాటైటిస్ అంటారు.
ఇందులో గ్రంథి కుచించుకు పోవటంతో పాటు పని తీరు దెబ్బ తినే అవకాశం ఉంది. మద్యపానం తో పాటు ఇతర కారణాలతో కానీ ఈ స్థితి తలెత్తవచ్చు. కడుపు పై భాగంలో తీవ్రమైన నొప్పి ప్రధాన లక్షణం. ఈ కడుపు నొప్పి వెన్నుపూసలోకి చొచ్చుకొని పోతున్నట్లు ఉంటుంది. దీంతోపాటు వాంతులు, విరోచనంలో చమురు కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తపు వాంతులు, పసిరికలు ఏర్పడుతాయి.
ఈ లక్షణాల్ని గుర్తిస్తే వైద్యుల్ని సంప్రదించాలి. సరైన రోగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తే ముందుగానే చికిత్స అందించేందుకు వీలవుతుంది. మెడికల్, సర్జికల్ విధానాల్లో దీనికి చికిత్స అందించేందుకు వీలవుతుంది.
పాన్ క్రియాస్ లో సమస్యలు తలెత్తకుండా క్రమబద్దమైన జీవన శైలిని అనుసరించాలి.మద్యపానానికి దూరంగా ఉండటం మేలు. ఏ మాత్రం అనుమానం కలిగినా వైద్యుల్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

ur articles are very informative, headings are tricky. good effort
ReplyDelete