నీరు అన్నది జీవాధారం. ప్రపంచ వాటర్ డే గా మార్చ్ 22ను పాటిస్తుంటాం. ఈ సందర్భంగా నీటి కి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకొందాం..
మానవ శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. వివిధ రూపాల్లో ఉండే ఈ ద్రవాలు జీర్ణ క్రియ, శోషణ, ప్రసరణ, రవాణా, ఉష్ణోగ్రత సమతుల్యత వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా శరీర బరువు నిర్దిష్టంగా ఉండేట్లు చేయటంలో నీటి ప్రాధాన్యం గుర్తించుకోదగినది. నీటిని కావాల్సినంతగా తీసుకోవటం వలన శరీరంలో జీవన క్రియలు చురుగ్గా సాగి, పరిమితిగా బరువు ఉంటుంది. ముఖ్యంగా చురుగ్గా రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి గుండె పోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతే గాకుండా మూత్ర పిండాల పని తీరు కూడా మెరుగవుతుంది. విసర్జన సాఫీగా ఉండటం వలన శరీరం చైతన్య వంతంగా ఉంటుంది. ప్రధానంగా చర్మానికి చెందిన గ్రంథులు చక్కగా పని చేసి చర్మం కాంతివంతంగా ఉంటుంది. శరీర భాగాలు చైతన్య వంతంగా ఉండటంతో పాటు మెదడు చురుగ్గా పని చేస్తుంది. దీంతో వివిధ అవయవాల మధ్య సమన్వయం చక్కగా సాగుతుంది.
అందుచేత శరీర బరువును బట్టి తగినంతగా నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అంత మాత్రాన విపరీతంగా మాత్రం తాగకూడదు సుమా..:

No comments:
Post a Comment