...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఈ రోజు ప్రాధాన్యం తెలుసు క‌దా.. !

ఈ రోజుకి చ‌రిత్ర‌లో ప్రాధాన్యం ఉంది. అంద‌రూ దీని గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. జూన్‌నెల‌లో మొద‌టి ఆదివారం రోజున క్యాన్స‌ర్ నుంచి విముక్తి పొందిన వారితో క‌లిసి క్యాన్స‌ర్ స‌ర్వైవ‌ర్స్ డే ను పాటిస్తుంటారు.

 క్యాన్స‌ర్ అంటే అదేదో అంతు ప‌ట్ట‌ని వ్యాధి అని అంతా భావిస్తుంటారు. చికిత్స లేని మొండి రోగం అని, క్యాన్స‌ర్ వ‌స్తే ఇక చేసేదేమీ లేద‌ని అపోహ‌లు ఉన్నాయి. ఇది ఏమాత్రం వాస్త‌వం కాదు.
క్యాన్స‌ర్ వ్యాధికి చికిత్స ఉంది. ముఖ్యంగా జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని ఆహార వాహిక‌, జీర్ణాశ‌యం, చిన్న పేగు, పెద్ద‌పేగు తో పాటు అనుబంధ గ్రంథులైన కాలేయం, క్లోమం ల‌లో క్యాన్స‌ర్ త‌లెత్తుతుంటుంది. క్యాన్స‌ర్ అంటే అవాంఛిత క‌ణ‌జాలం ఒక చోట చేరి, విస్త‌రిస్తుండ‌టం అని చెప్ప‌వ‌చ్చు. ఈ రోగ‌కార‌క క‌ణజాలం విస్త‌రించి ఆరోగ్య‌క‌ర‌మైన క‌ణ‌జాలాన్ని ఆక్ర‌మిస్తుంటుంది. దీంతో ఇత‌ర వ్య‌వ‌స్థ‌లు కూడా విఫ‌లం అవుతుంటాయి.
జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని భాగాల్లో ఏర్ప‌డే క్యాన్స‌ర్ కొన్ని సార్లు ఇత‌ర ప్రాంతాల‌కు కూడా వ్యాపించ‌వ‌చ్చు.

వాస్త‌వానికి క్యాన్స‌ర్ కు ఆధునిక వైద్య శాస్త్రంలో చ‌క్క‌టి చికిత్స‌లు ఉన్నాయని గుర్తించుకోవాలి. ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే క్యాన్స‌ర్ ను న‌యం చేయ‌టం అంత తేలిక అవుతుంది. మొద‌టి ద‌శ‌లో ఆప‌రేష‌న్ చేయ‌టం ద్వారా క్యాన్స‌ర్ ను పూర్తిగా తొల‌గించ‌వచ్చు. త‌ర్వాత ద‌శ‌ల్లో ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ వంటి చికిత్స‌లు అవ‌స‌రం అవుతాయి. వ్యాధి పూర్తిగా ముదిరిపోయిన‌ప్పుడు కూడా ఆధునిక చికిత్స‌ల‌తో నాణ్య‌మైన శేష జీవితాన్ని అందించేందుకు వీల‌వుతుంది.
క్యాన్స‌ర్ వచ్చింద‌ని తెలియ‌గానే కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. నిపుణులైన వైద్యుల్ని సంప్ర‌దించి చికిత్స చేయించుకోవాలి. క్యాన్స‌ర్ కు ఆధునిక చికిత్స‌లు అందుబాటులో ఉన్నాయ‌ని తెలుసుకోవాలి. క్యాన్స‌ర్ విష‌యంలో అంద‌రికీ అవగాహ‌న అవ‌స‌రం. ఈ ర‌క‌మైన అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఇటువంటి క్యాన్సర్ స‌ర్వైవ‌ర్స్ డే లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

No comments:

Post a Comment