...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

గుంటూరు-కృష్ణా జిల్లాల్లో ఇప్పుడు గమనిస్తున్న అంశం ఏమిటంటే..?

గుంటూరు-కృష్ణా జిల్లాలు కోస్తాంధ్ర లో మధ్య లో ఉన్న రెండు జిల్లాలు. ఈ రెండు జిల్లాల్లో తూర్పున విస్తరించి బంగాళాఖాతం. అంతే కాదు.. కోస్తా లోని తొమ్మిది జిల్లాల్లోనూ కూడా బంగాళాఖాతం కనిపిస్తుంది.
 ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు గాలి వీస్తు ఉంటుంది. ఇది ఒక రకంగా ఉండే ప్రత్యేక మైన గాలి అనుకోవచ్చు. కొబ్బరి, సర్వేరు వంటి కొన్ని రకాల చెట్లు ఈ గాలిలోనే ఎక్కువ పెరుగుతాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ తీర ప్రాంతాల్లో ఉండే చిన్నారుల్లో ట్రాపికల్ పాన్‌ క్రియాటైటిస్‌ అనే వ్యాధిని ఎక్కువగా గమనించటం జరుగుతోంది. పాన్‌ క్రియాస్‌ అనే గ్రంథిలో ఏర్పడే ఈ సమస్య – చాలా వరకు అక్కడ ఉండే  చిన్న పిల్లల్లో గమనించటం జరుగుతోంది. వాస్తవానికి పాన్‌ క్రియాస్‌ అనేది శరీరంలోనే ఒక విశిష్టమైన గ్రంథి. ఇది ఎంజైమ్‌ లను స్రవించటం ద్వారా జీర్ణ క్రియలో కీలక పాత్ర వహిస్తుంది. చాలా వరకు ఆహార పదార్థాలు జీర్ణ మయ్యే పేగుల్లో ఈ ఎంజైమ్‌ లు చురుకైన పాత్ర పోషిస్తాయి. అటు, గ్లూకగాన్‌, ఇన్సులిన్‌ వంటి హార్మోన్‌ లను స్రవించటం ద్వారా గ్లూకోజ్‌ ను క్రమబద్దం చేయటంలో కూడా పాన్‌ క్రియాస్‌ ముఖ్య భూమిక పోషిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంజైమ్‌లను, హార్మోన్లను రెంటినీ స్రవించే ఏకైక గ్రంథిగా దీన్ని చెప్పవచ్చు.


కడుపులో తీవ్రమైన నొప్పి తో పాటు బరువు తగ్గటం, పోషకాహార లోపం వంటి లక్షణాల్ని గమనించవచ్చు. కచ్చితంగా ఈ సమస్య తలెత్తటానికి కారణం తెలీక పోయినా పుట్టుకతో వచ్చే జన్యు లోపాల్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.. ఈ సమస్యకు చికిత్స చేయించకపోతే మదుమేహం తలెత్తే అవకాశం ఉందన్న మాట ఉంది. ఒక్కోసారి ఇది పాన్‌ క్రియాటిక్‌ క్యాన్సర్‌ కు దారి తీసే ప్రమాదం ఉంది. సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారిస్తారు. మందులతో సమస్య పరిష్కారం దొరక్కపోతే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. కోస్తా ప్రాంతంలోని చిన్నారులు కడుపు నొప్పి తో బాధ పడుతుంటే- ఈ విషయాన్ని కాస్త గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment