భారత్ కు కాస్తంత దగ్గరగా
ఉండే దేశాలుగా ఆగ్నేయాసియా దేశాల్ని చెప్పవచ్చు. ఇక్కడ వారికి పూర్వం నుంచి భారత్
తో మంచి సంబంధాలు ఉండేవి. అందుకే ఈ దేశాల వారికి భారత్ అంటే అభిమానం. అందుకే అక్కడ
నుంచి ఇక్కడకు , ఇక్కడ నుంచి అక్కడకు రాకపోకలు ఎక్కువగా కనిపిస్తు ఉంటాయి.
ఈ మధ్యనే ఫిలిప్పీన్స్
రాజధాని మనీలా లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఆగ్నేయాసియా దేశాల గ్యాస్ట్రో మీట్
జరిగింది. అనేక దేశాల నుంచి గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్లు ఈ సదస్సులో పాల్గొవటం
జరిగింది. భారత్ నుంచి దీనికి స్పీకర్ గా ఆహ్వానం అందటంతో నేను అక్కడకు వెళ్లటం
జరిగింది. కాలేయానికి చేసే ఆపరేషన్లు, ఎదురయ్యే సమస్యల మీద ప్రసంగించటం జరిగింది.
అనేక దేశాల నుంచి వచ్చిన డాక్టర్లు శ్రద్దగా వినటమే కాకుండా ఇంటరాక్షన్ కూడా బాగా
జరిగింది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధుల చికిత్సకు సంబంధించిన అనేక అంశాలపై చర్చ బాగా
జరిగింది. దీంతోపాటు విభిన్న అంశాలపై పరిశోధనలు చేస్తున్న వైద్య నిపుణుల మధ్య
పరిచయాలు జరిగాయి.
గతంలో కూడా ఫిలిప్పీన్స్ వెళ్లినప్పటికీ
ఈ సారి వాతావరణం బాగుంది. అందుకే సదస్సు తర్వాత మన బారత్ నుంచి వచ్చిన ఇతర
డాక్టర్ల తో కలిసి కాస్సేపు సిటీ టూర్ కు వెళ్లి వచ్చాం. అక్కడ ప్రజల స్థితిగతులు,
జీవన విధానాలు బాగున్నాయి. మొత్తం మీద సింగపూర్ అయినా, మలేషియా అయినా,
ఫిలీప్పిన్స్ అయినా.. ఆగ్నేయాసియా దేశాల్లో భారతీయుల్నిఅభిమానంగా చూస్తారని అర్థం
అయింది.