చిన్న పాటి జాగ్రత్తలు ఇచ్చే ఫలితాలు చాలా బాగుంటాయి. కానీ చిన్న విషయమే కదా
అని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ దీని ప్రభావం మాత్రం ఎక్కువగా
కనిపిస్తుంటుంది. దీన్ని అంచనా వేయటంలో మనం పొరపాటు పడుతుంటాం. దీన్ని
గమనించుకోవలసిన అవసరం ఉంది.
వీకెండ్ లో చాలా మంది బయటకు వెళ్లాలని కోరుకొంటాం. సాధారణంగా ఫుడ్ కూడా బయటే
తీసుకొని ఇంటికి వెళుతుంటాం. అటువంటప్పుడు ఆహారం తీసుకొనే టప్పుడు ముందుగా చేతుల్ని
శుభ్రం చేసుకోవటం మరిచిపోవద్దు. అక్కడ ఉండే సోప్ బాగోలేదనో, లేదా ఈ ఒక్కసారి ఏం
చేస్తాం లే అనో వదిలేస్తుంటాం. కానీ హ్యాండ్ వాష్ అన్నది ఒక మంచి అలవాటు మాత్రమే
కాదు. వందలాది క్రిముల్ని దూరం చేసే చిన్న టెక్నిక్ అందుకని మనం కాస్త కేర్ ఫుల్
గా ఉంటే బాగుంటుంది కదా..
No comments:
Post a Comment