రాఖీ పండుగ అందరికీ ఒక
మధురానుభూతి. ముఖ్యంగా సోదరీ, సోదరులకు అనుబంధాన్ని పంచే ఒక వేడుక. రక్షణ గురించి
గుర్తు చేసే ఒక ఘట్టం. అందుకే దీన్ని అన్ని ప్రాంతాల్లో జరుపుకొంటారు. రాఖీ రోజున
సోదరి ఒక రక్షాబంధాన్ని సోదరునికి కడుతుంది. ఆ తర్వాత స్వీట్లు పంచుకొని
మధురానుభూతిని పంచుకొంటారు.
ఇంత వరకు బాగానే ఉంది.
కానీ, స్వీట్ షాపుల్లో స్వీట్లు కొనేటప్పుడు, లేదా సామూహిక వేడుకల్లో స్వీట్లు
పంచేటప్పుడు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. స్వీట్ షాపు యజమాని లేదా ఫంక్షన్
ఇస్తున్న అతిథి చాలా శుభ్రతను పాటిస్తూ ఉండవచ్చు. కానీ అందులో స్వీట్ లు ప్యాక్
చేసి ఇచ్చే వ్యక్తి లేదా ఫంక్షన్ లో స్వీట్లు పంచుతున్న వ్యక్తి అదే వ్యక్తిగత
శుభ్రత ను పాటించక పోవచ్చు. (శుభ్రతను
పాటిస్తే అంతా మంచిదే అనుకోండి) అందుచేత ఈ వ్యక్తులు చేతికి ప్లాస్టిక్ తొడుగు
వాడుతున్నారో లేదో చూడండి. కొన్ని సందర్బాల్లో ఇది కనిపిస్తుంది,మరికొన్న
సందర్బాలలో ఇది కనిపించక పోవచ్చు. అటువంటప్పుడు మాత్రం కచ్చితంగా ఈ గ్లోవ్స్ ను
వాడమని చెప్పండి.
చాలావరకు క్రిములు చేతి
శుభ్రత పాటించక పోవటం వల్లనే వ్యాపిస్తుంటాయి. తినే ఆహార పదార్ధాల్ని రక రకాల చేతులతో కలియ బెట్టడం
అన్నది అంత మంచిది కాదు. అందుచేత వేదికల మీద లేదా ఫంక్షన్ లు చేసేటప్పుడు స్వీట్లు
తీసుకొని వచ్చి నోటిలో కుక్కుతుంటే సున్నితంగా వారించవచ్చు. తప్పేమీ కాదు, తప్పనిసరి
అయితే కొద్ది గా తీసుకొని ఆ సందర్భాన్ని దాటించవచ్చ. అంతే కానీ మొహమాటానికి పోయి
మొత్తానికి సమస్యల తెచ్చుకోవద్దు.
అందరికీ రాఖీ పండుగ
శుభాకాంక్షలు
No comments:
Post a Comment