ఆదివారం అంటే చాలా మందికి ఆనందమే. చాలా మందికి సెలవు ఉంటుంది కాబట్టి
పిల్లలకు ఎలాగూ స్కూల్ హాలీడే. పెద్దలకు ఆఫీసులకు, వ్యాపారాలకు సెలవు ఉంటుంది
కాబట్టి వీకెండ్ ను ఎలా ఎంజాయ్ చేయాలా అని ఇప్పటికే ప్లాన్ చేసేసుకొంటారు. చాలా
సందర్భాల్లో కుటుంబంతో కలిసి భోజనానికి బయటకు వెళ్లడానికి చాలామంది ఆదివారం ను
ఎంచుకొంటారు. కుటుంబంతో కలిసి బయట తిరిగి రావటం అన్నది చాలా అవసరం కూడా. వారమంతా
దైనందిక పనులతో అలసిపోయిన వారికి ఇది మంచి రీచార్జ్ అవుతుంది.
బయట భోజనం చేసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త
తీసుకోవటం మంచిది. ఇప్పుడు చాలామంది హెల్త్ అవేర్‌నెస్ పెంచుకొంటున్నారు. అందుచేత
ఇంటి దగ్గర లేక ఆఫీసులో భోజనం చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేయటం అలవాటు
చేసుకొంటున్నారు. (ఒక వేళ మీకు కనుక ఆ అలవాటు లేకపోతే మాత్రం తప్పనిసరిగా దీన్ని అలవాటు
చేసుకోండి. మేం స్పూన్ తో ఫుడ్ తింటాం కదా అని సెటైర్లు మాత్రం వేయకండి. జస్ట్ ఆ
స్పూన్ ఎంత శుభ్రంగా ఉందో చెక్ చేసుకోండి చాలు) కానీ బయటకు వెళ్లినప్పుడు మాత్రం
అన్ని సార్లు ఇది కుదరక పోవచ్చు.
కొన్ని చోట్ల లిక్విడ్ హ్యాండ్ వాష్
పెడుతున్నారు కాబట్టి దీన్ని వాడటానికి మొహమాట పడవద్దు. అప్పటిదాకా బయట తిరిగి ఆ
చేతులతోనే తినటానికి రెడీ కావద్దు. కనీసం వాష్ లిక్విడ్ చిన్నబాటిల్స్ దొరకతున్నాయి
కాబట్టి వాటిని అయినా వెంట తీసుకెళ్తే అయిపోతుంది. దీన్ని వాడటం మంచిది అన్న మాట
తెలిసిందే కదా. మొహమాటంతో కమిట్ అయ్యేకంటే ఇది బెటర్ అనిపిస్తుంది. అక్కడ స్పూన్
లు, ఫోర్క్ లు క్లీన్ గా ఉంటాయని నమ్ముతాం కాబట్టి వాటిని వాడుకొన్నా ఫర్వాలేదు.
చిన్న జాగ్రత్త బోలెడు మేలు చేస్తుందని మరవకండి
సుమా..!