...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

టెక్నాలజీ ని ఎక్కువగా వినియోగిస్తే ఈ లాభం కూడా ఉంటుంది కదా..!




వ్యాధుల నిర్ధారణలో టెక్నాలజీ పాత్ర అంతకంతకూ పెరుగుతోంది. అధునాతన టెక్నాలజీ ని వాడటం వలన వ్యాధుల నిర్ధారణ మరింత కచ్చితంగా జరుగుతోంది.  ప్రస్తుత కాలంలో వ్యాధుల నిర్ధారణ అనేది కీలకంగా మారుతోంది. వ్యాధి నిర్ధారణ సక్రమంగా జరిగితే చికిత్స సునాయసంగా జరుగుతుంది. దీంతో రోగికి ఎంతో మేలు కలుగుతుంది. ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఎండోస్కోపిక్‌ అల్ట్రాసౌండ్‌ పాత్ర విశిష్టమైనది. ఈ సందర్భంగా ఈ పరికరం వలన కలిగే ప్రయోజనాలు చూద్దాం.
ఎండోస్కోప్, అల్ట్రాసౌండ్ పరికరాలు జీర్ణకోశ వ్యాధుల నిర్ధారణ, చికిత్సల్లో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని సమ్మిళితం చేసి రూపొందించినదే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్‌. ఈ రెండు విధానాల్ని జోడించి పంపడంతో దీని ద్వారా జీర్ణ నాళంలోని అన్ని భాగాల్ని సునిశితంగా దర్శించేందుకు వీలవుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో హై రిజల్యూషన్‌ ఉండే చిత్రాల్ని పొందవచ్చు.  ఫలితంగా అక్కడి పరిస్థితులు కళ్లకు కట్టినట్లు తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఆహార వాహిక, జీర్ణ కోశం, పేగులు, వంటి భాగాల్లో ఇబ్బందుల్ని గుర్తించవచ్చు.
క్యాన్సర్ వ్యాధుల నిర్ధారణలో బయాప్సీ పరీక్ష అన్నది ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. ఈ పరికరం ద్వారా బయాప్సీ చేయటంతో పాటు వివిధ భాగాల్లో ఏర్పడిన క్యాన్సర్ కణితుల్ని సునిశితంగా గుర్తించవచ్చు. దీంతో క్యాన్సర్ చికిత్సలు తేలిక అవుతాయి. గాల్ స్టోన్స్ లో చాలా చిన్న రాళ్లను సైతం కనుక్కోవచ్చు. క్రానిక్ పాన్ క్రియాటైటిస్ లో వ్యాధి జనిత క్రమం అర్థం చేసుకోవటం తేలికవుతుంది. జీర్ణ కోశ వ్యాధుల్లో ఇటువంటి పరికరాల తో వ్యాధి నిర్ధారణ, చికిత్స మరింత మెరుగవుతాయి.
అదే సమయంలో నిగూఢంగా ఉన్న ప్రాంతాల నుంచి (కాలేయం, క్లోమం) బయాప్సీ వంటి పరీక్షలు చేయటం వీలవుతుంది. రోగ నిర్ధారణ లోనే గాకుండా అనేక వ్యాధుల చికిత్సలోనూ ఇది ఉపయోగపడుతుంది. తొలి దశలో ఉండే గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌, పాన్‌ క్రియాస్‌ లో వచ్చే నీటిబుగ్గలు, కొన్ని రకాల గాల్‌ బ్లాడర్‌ ఇన్‌ ఫెక్షన్‌ లు ఆపరేషన్‌ అవసరం లేకుండానే చికిత్స చేయటానికి వీలవుతుంది.
ఈ విశిష్ట పరికరం ఇప్పుడు హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్‌ లో అందుబాటులోకి వచ్చింది. దీని సేవల్ని పొందేందుకు వీలవుతోందని గుర్తించుకోవచ్చు. ఇది ప్రజల అవగాహన కోసం చేసే ప్రయత్నం మాత్రమే.

No comments:

Post a Comment