జాగ్రత్త ను మించిన తరుణోపాయం ఎప్పుడూ ఉండదు. ముఖ్యంగా సామాజిక అంశాల్లో చిన్న పాటి జాగ్రత్తలు కూడా భలే ఉపయోగ పడతాయి.
హైదరాబాద్‌లో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ గురించి చర్చ బాగా జరుగుతోంది. వందల సంఖ్యలో కేసులు నమోదు కావటం, వేల సంఖ్యలో అనుమానాస్పద కేసులు ఉండటంతో ఇది కలకలం రేపుతోంది.
స్వైన్ ఫ్లూ అనేది వైరస్ ద్వారా వచ్చే రోగం. ఇది అంటు వ్యాధి. ప్రధానంగా పందులు సంచరించే చోట, వాటి నుంచి మనుషులు సంక్రమిస్తుంది. కానీ, స్వైన్ ఫ్లూ సోకిన రోగి దగ్గినా, తుమ్మినా .. వాటి నుంచి ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. అందుచేత ఈ వైరస్ సోకకుండా జాగ్రత్త పడటం మంచిది. అయితే దీని నివారణ కోసం చాలా మంది రక రకాల మాస్క్ లు ముక్కుకు ధరించి తిరిగేస్తున్నారు. నాణ్యత కలిగిన మాస్క్ లు అయితే బాగా పనిచేస్తాయి. దీన్ని ఎప్పటికప్పుడు మార్చేయటం మేలు. లేనిపక్షంలో చేతి రుమాలును 4 మడతలుగా వేసుకొని ధరించవచ్చు.
అంతకు మించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం చాలా ముఖ్యం. రోజుకి నాలుగైదు సార్లు చేతిని సబ్బుతో కడుక్కోండి. వ్యాధి కారక ప్రదేశాలు,అందరు వాడే బటన్స్ మీద ఎక్కువ వేళ్లను ఉపయోగించకండి. అపరిశుభ్ర ప్రాంతాల్లో ఆహారం తీసుకోవడాన్ని సాధ్యమైనంత దూరం పెట్టండి. సామాజిక శుభ్రత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి.
స్వైన్ ఫ్లూ కు ప్రస్తుతం టీకాలు దొరకుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి మాత్రం కాదు. అవగాహన కలిగి ఉండే సరిపోతుంది.
No comments:
Post a Comment