వినటానికి అతి శయోక్తి
గా ఉన్నా ఇది నిజం. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది.
చిన్న పాటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవటం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండటం ముఖ్యం
అన్న మాట.
ఇవాళ వరల్డ్
హెల్త్ డే. ఈ సందర్భంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకొనే వారందరికీ శుభాకాంక్షలు.
ఇవాళ ఏడో తేదీ కాబట్టి ఏడు
ముఖ్య విషయాల్ని మననం చేసుకొందాం.
1. చేతుల శుభ్రత
చాలా ముఖ్యం. ఆహారం తినటం దగ్గర నుంచి రక రకాల పనులకు ఉపయోగిస్తాం. వీటిని
తరచుగా సబ్బు నీటితో శుభ్రం చేసుకొంటే వేలాదిక్రిములను దూరం పెట్టవచ్చు.
ముఖ్యంగా ఆహారం తీసుకొనే ముందు, మల మూత్ర విసర్జన
తర్వాత మరిచిపోకుండా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.
2. గోళ్లను కత్తిరించుకోవటం
చాలా ముఖ్యం. లేదంటే క్రిములు అక్కడ స్థిరపడి, ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
3. ఆహారం
తీసుకొనేందుకు సమయ పాలన పాటించాలి. అంటే ఉదయం టిఫిన్ తీసుకొనేందుకు, మధ్యాహ్నం మరియు రాత్రి ఆహారం తీసుకొనేందుకు
ఒకే రకమైన సమయాన్ని అనుసరించాలి.
4. ఆహారం సమతుల్యంగా
ఉండేలా చూసుకోవాలి. అంటే కేవలం పిండి పదార్థాలు,కొవ్వులేకాకుండా ప్రోటీన్స్ మరియు విటమిన్స్
ఉండేట్లు జాగ్రత్త తీసుకోవాలి.
5. పని ఒత్తిడిలో
కొంత మంది విరేచనాన్ని వాయిదా వేస్తుంటారు. ఇది మంచిది కాదు, సకాలంలో తినటం, సక్రమంగా వ్యర్థాల్ని బయటకు పంపించండం
చాలా ముఖ్యం.
6. ఆహారం తిన్న తర్వాత
వెంటనే నిద్రకు ఉపక్రమించటం మంచిది కాదు. తేలికపాటి కదలికలతో ఆహారం సక్రమంగా
జీర్ణం అవుతుంది,కొవ్వులు
పేరుకోకుండా ఉంటాయి.
7. ఆహారంతో పాటు తగినంత
పరిణామంలో నీరు తాగుతూ ఉండాలి. మిగిలిన
వేళల్లో కూడా నీరు తాగటం మంచిది.
No comments:
Post a Comment