క్యాన్సర్ అంటే చాలా మందికి భయం. దీనికి మందు లేదని అనుకొంటారు. కానీ ఇది అపోహ. క్యాన్సర్ అనేది ప్రమాదకరం అనటంలో సందేహం లేదు. క్యాన్సర్ ముదిరిపోతే కాపాడటం కష్టం అనేది అంతే వాస్తవం. అయితే ఆధునిక వైద్య పరిశోధనల పుణ్యమా అని క్యాన్సర్ పై పరిశోధనలు బాగా పెరిగాయి. దీంతో చాలా వరకు క్యాన్సర్ కేసుల్లో చికిత్సలు సాధ్యం అవుతున్నాయి.
జీర్ణ వ్యవస్థలోని అనేక భాగాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, రెక్టమ్ లతో పాటు కాలేయం, క్లోమం అనే అనుబంధ గ్రంథుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక క్యాన్సర్ అంటే అక్కడే పుట్టి, అక్కడే విస్తరించే క్యాన్సర్ లేదా ద్వితీయ క్యాన్సర్ అంటే వేరే చోట పుట్టి ఇక్కడకు వచ్చి తిష్ట వేసే క్యాన్సర్ లు ఉన్నాయి. అయితే ఈ క్యాన్సర్ లను ఫలానా లక్షణాలతో గుర్తించటం కష్టం. సాధారణంగా ఉండే లక్షణాలే కనిపిస్తాయి. కానీ రోగ నిర్ధారణ పరీక్షలతో గుర్తించవచ్చు.
అయితే క్యాన్సర్ నిర్ధారణ అయితే మాత్రం భయ పడిపోవాల్సిన అవసరం లేదు. నిపుణులైన వైద్యుల్ని సంప్రదిస్తే చికిత్స అందించేందుకు వీలవుతుంది. ఇటీవల కాలంలో ఆధునిక పరిశోధనలు, టెక్నాలజీ సాయంతో మెరుగైన చికిత్సను సమర్థవంతంగా అందించేందుకు వీలవుతోంది. దీంతో క్యాన్సర్ ను అదుపు చేయటం వీలవుతోంది. మరీ ముదిరిపోయిన కేసుల్లో నాణ్యమైన శేష జీవితాన్ని అందించటం జరుగుతోంది.
No comments:
Post a Comment