అవును.. తక్కువ ఖర్చుతో అధునాతన వైద్యం సాధ్యమే అని నిరూపించారు డాక్టర్ రాఘవేంద్రరావు. సర్వేంద్రియాణాం అవయవం ప్రధానం అనుకోవచ్చు. ఎందుకంటే మానవ శరీరంలో అన్ని అవయవాలకు ఆయా ప్రాధాన్యత ఉంటుంది. కానీ కొన్ని అవయవాల విషయంలో మాత్రం ఎక్కువ ప్రధానం అనుకోవాలి. ఎందుకంటే ఈ అవయవాలు..తమ పనితీరులో విఫలం అయితే, లేదా చెడిపోతే..ఇతర అవయవాలు ఏమీ వాటి పనులు చక్కబెట్టలేవు. అటువంటి కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. జనగామ్ కు చెందిన విజయ్ కుమార్ విషయంలో అదే జరిగింది.
వరంగల్ జిల్లా జనగాం కు చెందిన విజయ్ కుమార్ కు కాలేయం చెడిపోయింది. మందులు, శస్త్ర చికిత్సలు కూడా విఫలమైన దశ కు కాలేయం చేరుకొంది. ఈ దశలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (సాయివాణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి)ని సంప్రదించటం జరిగింది. హాస్పిటల్ లోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ లివర్ ట్రాన్సుప్లాంట్ సర్జన్ డాక్టర్ ఆర్ వీ రాఘవేంద్రరావు పేషంట్ ను పరిశీలించి, కాలేయ మార్పిడి ద్వారానే ఉపశమనం కలుగుతుందని నిర్ధారించారు. దక్షిణ కొరియాలో కాలేయ మార్పిడిలో శిక్షణ పొంది, అనేక మందికి విజయవంతంగా కాలేయ మార్పిడి చేసిన డాక్టర్ ఆర్ వీ రాఘవేంద్రరావు ఇందుకు గల మార్గాల్ని అన్వేషించారు.
ఈలోగా జూన్ 22న జీవన్ ధాన్ పథకం ద్వారా విజయవాడలో ఒక యువకుడు బ్రెయిన్ డెడ్ అయినట్లు సమాచారం అందింది. అప్పుడు డాక్టర్ రాఘవేంద్ర రావు బృందం అప్పటికప్పుడు విజయవాడ బయలు దేరింది. అక్కడ పిన్నమనేని వైద్య కళాశాల ఆసుపత్రి లో బ్రెయిన్ డెడ్ అయిన పి. నాగబాబు నుంచి కాలేయాన్ని శస్త్ర చికిత్స ద్వారా వేరు చేసి, అప్పటికప్పుడు విమానంలో హైదరాబాద్‌కు తీసుకొని వచ్చారు. దాన్ని 12 గంటల్లోగా గ్రహీత శరీరంలో అమర్చాలి. అందుకే ఆ 8-9గంటల పాటు సర్జరీ చేసి ఈ కాలేయాన్ని విజయ వంతంగా రోగి శరీరంలో అమర్చటం జరిగింది.
వారం రోజులు ఐసీయూలో ఉంచి అబ్జర్వ్ చేసిన తర్వాత సాధారణ వార్డుకి మార్చటం జరిగింది. పేషంట్ పూర్తిగా కోలుకోవటంతో డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్బంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (సాయివాణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి) డైరక్టర్ రాఘవేంద్రరావు పాత్రికేయులతో మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించటం లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని వివరించారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి, నిపుణులైన వైద్యులతో సంక్లిష్టమైన ఆపరేషన్ లు సైతం విజయవంతంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కాలేయ మార్పిడి ఆపరేషన్ కు ఇతర కార్పొరేట్ సంస్థలతో పోలిస్తే సగం ధరకే తాము చేయగలిగామని వివరించారు. ఈ సందర్భంగా పేషంట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తమకు చికిత్స అందించిన డాక్టర్ రాఘవేంద్రరావు, బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment