ప్రపంచ క్యాన్సర్ డే. అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు క్యాన్సర్ గురించి
తెలుసుకొనే రోజు అన్నమాట.
వాస్తవానికి క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. ఇది సరి కాదు.
శరీరంలో ఏదో ఒక భాగంలో అవాంఛనీయ కణజాలం పేరుకొనిపోయి కణితిగా మారుతుంది. ఇది
క్రమేపి పెరిగిపోయి సజీవ కణజాలాన్ని తినివేస్తూ విస్తరించటాన్ని క్యాన్సర్ అంటారు.
కణితి లు అన్నీ క్యాన్సర్ కాదని గుర్తించుకోవాలి. ఇది శరీరంలోని ప్రధానభాగాలైన
ఎముకలు, గొంతు, వంటి భాగాలతో పాటు జీర్ణావయవాలైన కడుపు, కాలేయం, క్లోమం వంటి
భాగాల్లో ఏర్పడవచ్చు.
జీర్ణ వ్యవస్థ లో ఏర్పడే క్యాన్సర్ కు ఇప్పుడు చికిత్సలు లభిస్తున్నాయి.
ర్యాడికల్ సర్జరీ ద్వారా క్యాన్సర్ ఏర్పడిన భాగాన్ని తొలగించి చికిత్స చేయటానికి
వీలవుతుంది. దీంతో పాటు అడ్వాన్సు డ్ దశల్లో కీమో థెరపీ, రేడియో థెరపీ లు చేయటంతో
పరిష్కారం చేయవచ్చు. క్యాన్సర్ లో మొదటి , మద్య దశ వరకు చికిత్సలు సాధ్యం
అవుతున్నాయి. మరీ ముదిరిపోయిన దశలో కూడా నాణ్యమైన శేష జీవితాన్ని అందించటానికి
వీలవుతుంది.
No comments:
Post a Comment