వినటానికి కొంత అతిశయోక్తి లా
ఉన్నా..ఇది నూటికి నూరుపాళ్లు నిజం. మన ఆరోగ్యాన్ని కాపాడుకొనే శక్తి మనకే ఉంది.
ఇందుకు చేయాల్సింది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం. ఉదాహరణకు మన కెరీర్ లో
కానీ, పని తీరులో కానీ సమయ పాలనకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అంటే కేటాయించిన పని
ని నిర్దిష్ట వేళల్లో పూర్తి చేయటం అన్న మాట.
అలాగే మనం ఆహారం తీసుకోవటం
విషయంలోనూ ఇదే రకమైన సమయ పాలన్ని పాటించాలి. అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం
లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ తీసుకోవటం వంటి నాలుగైదు సెగ్మంట్ లుగా
ఆహారం తీసుకోవటం చాలా మందికి అలవాటు. ఈ అలవాటుని జాగ్రత్తగా పాటించాలి. అంటే ప్రతీ
రోజు దాదాపుగా అదే సమయానికి ఆ రకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు ప్రతీ రోజు
ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేసి ఆఫీసుకి వెళ్లటం లేదంటే ఇంటి పని చేసుకోవటం
అలవాటు ఉంటే అలాగే ఈ పనిని చేసుకోవాలన్న మాట.
దీని వల్ల క్రమం తప్పకుండా ఆహారం
సక్రమంగా జీర్ణం అయి, జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. శరీరానికి క్రమం
తప్పకుండా శక్తి అందుతుంది.
No comments:
Post a Comment