...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS
చేతుల్ని శుభ్రపరుచుకోవటం ఎలా.. ఉపయోగాలు ఏమిటో తెలుసా..!

అర చేతుల్ని తరుచూ శుభ్రం చేసుకోవటం చాలా ముఖ్యం. సబ్బుతో కానీ, శానిటైజర్‌ తో కానీ శుభ్రం చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి.

వాస్తవానికి చేతులు శుభ్రం చేసుకోవటం మీద మెడికల్ పరిశోధనలు జరిగాయి. మొదటగా చేతుల్ని నీటితో తడి చేసుకోవాలి. తరువాత సబ్బు బాగా పట్టించాలి. అప్పుడు రెండు చేతుల్ని బాగా రుద్దుకోవాలి. తర్వాత కొద్దిగా నీటిని పోసుకొని బాగా నురుగు వచ్చేలా రుద్దుకోవాలి. ముఖ్యంగా వేళ్ల చివరల్లో, అర చేతుల్లో బాగా రుద్దుకోవాలి. తరువాత నురుగు మొత్తం వదిలేట్లుగా నీటితో కడిగేసుకోవాలి. తరువాత శుభ్రమైన పొడి గుడ్డతో తుడుచుకోవాలి.

చేతుల్ని ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలంటే...
1) భోజనానికి ముందు
2) మల విసర్జన తరువాత
3) వంట చేసేటప్పుడు
4) పిల్లలకు డైపర్‌ మార్చినప్పుడు
5) రోగులకు సపర్యలు చేసినప్పుడు

చేతుల్ని శుభ్రం చేసుకోవటం వల్ల ప్రయోజనాలు...
అర చేతుల్ని వందల సంఖ్యలో సూక్ష్మ జీవులు ఆశ్రయించుకొని ఉంటాయి. వీటిని సబ్బుతో రుద్దటం ద్వారా వదిలించుకొనేందుకు వీలవుతుంది. అప్పుడు వివిధ పనులు చేసుకొన్నప్పుడు ఆరోగ్యకరంగా సాగించగలుగుతాం. 

చరిత్ర లో ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది తెలుసా..!

హెపటైటిస్‌ డే 2017..! 
ప్రపంచ ఆరోగ్య సంస్థ జూలై 28 న హెపటైటిస్‌ డే గా ప్రకటించటం జరిగింది. హెపటైటిస్‌ ను తరిమి కొట్టేందుకు అవగాహన కల్పించాలని పిలుపు ఇచ్చింది. ప్రమాద కరమైన సమస్యల్లో ఒకటిగా గుర్తించి అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. 

ఇందులో ఐదుర‌కాల వైర‌స్ ల‌ను గుర్తించ‌వ‌చ్చు. హెప‌టైటిస్ ఏబీసీడీఈ అనే వైర‌స్ ల కార‌ణంగాకామెర్లు సోకుతాయి. వీటిలో హెప‌టైటిస్ ఏఈ అనే వైర‌స్ లు క‌లుషిత ఆహారంక‌లుషిత నీటి ద్వారా ఒక‌రి నుంచి ఒక‌రికి సోకుతాయి. ఎక్కువ‌మంది లో ఈ వైర‌స్ ఎక్కువగా హాని క‌ల్గించ‌క పోవ‌చ్చు. హెప‌టైటిస్ బీసీ అనే వైర‌స్ లు మాత్రం క‌లుషిత లాలాజ‌లంక‌లుషిత ర‌క్తంక‌లుషిత వీర్యం ద్వారా ఒక‌రి నుంచి ఒక‌రికి సంక్రమిస్తుంది. ఈ వైర‌స్ లు మాత్రం కాలేయానికి తీవ్రమైన హాని క‌ల్గిస్తాయి.
సుదీర్ఘకాలం పాటు ఆల్కహాల్ ను ఎక్కువ‌గా తీసుకొంటుంటే కాలేయ పాడ‌వ‌టం ఖాయం.మొద‌ట్లో కాలేయ క‌ణాల స్థానంలో కొవ్వుక‌ణాలు పోగుప‌డి త‌ర్వాత కాలంలో ఇవే స్థిర‌ప‌డ‌తాయి. వాస్తవానికి మ‌ద్యం ఎంత వ‌ర‌కు తాగ‌వ‌చ్చు అనే ప‌రిమితి చెప్పటం క‌ష్టం. ఇది ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉండ‌వ‌చ్చు. అందుచేత మ‌ద్యం తాగ‌టం అనేది హానిక‌రం అని గుర్తుంచుకోవాలి. 
సమస్య తొలుత దశలో మందులతో పరిష్కారం సాధ్యం అవుతుంది. ముదిరిన దశలో మాత్రం  ఆపరేషన్‌ విధానాలు అవసరం అవుతాయి. 
ఆరోగ్యకరమైన అలవాట్లు, సక్రమమైన జీవన శైలిని పాటించటం ద్వారా ఈ సమస్యను అరికట్ట వచ్చు. 

కాలేయ సంరక్షణ మన చేతుల్లోనే ఉంది తెలుసా..!

సాధారణంగా ఆరోగ్య పరిరక్షణ మన చేతుల్లోనే ఉందని మనందరికీ తెలుసు. ముఖ్యంగా శరీరంలో అనేక ముఖ్య విధుల్నినిర్వర్తించే కాలేయ పరిరక్షణ కూడా మన అలవాట్లతో నిర్దేశించుకోవచ్చు.

కాలేయం అన్నది జీర్ణ వ్యవస్థ తో పాటు అనేక ముఖ్య వ్యవస్థలతో అనుసంధానం అయి ఉంటుంది. అయితే తీసుకొనే ఆహారంలోని కొవ్వు పదార్థాలు కాలేయాన్ని చేరటం సహజం. ఈ క్రమంలో చెడు అలవాట్లకు బానిస అయితే అటువంటి పదార్థాలు కూడా కాలేయాన్ని చేరిపోతాయి. ముఖ్యంగా మద్యానికి బానిస అయిన వారిని చూసినప్పుడు అందులోని విష పదార్థాలు ఎక్కువగా కాలేయంలోనే పోగు పడతాయి. అందుచేత అంతిమంగా కాలేయం పాడవటం చూస్తుంటాం.

అందుచేత చెడు అలవాట్లకు ముఖ్యంగా మద్యపాానానికి దూరంగా ఉంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఇటువంటి విషయాలు జాగ్రత్తగా గమనించుకోవం మేలు. 
కాలేయ మార్పిడి..అవ‌గాహ‌న‌
జీర్ణ వ్య‌వ‌స్థ లో కాలేయం ఒక ముఖ్య‌మైన అవ‌య‌వం. జీర్ణాశ‌యానికి కుడివైపున ఇది అమ‌రి ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయ‌టంలో కీల‌క‌పాత్ర పోషించ‌టంతో పాటు ప్రోటీన్ సంశ్లేష‌ణ‌, ఔష‌ద వినియోగం, మ‌లినాల విస‌ర్జ‌న వంటి అనేక జీవ‌న క్రియ‌ల్లో ఉప‌యోగ‌ప‌డుతుంది.
అనేక సార్లు కాలేయం చెడిపోవటంతో దాన్ని పూర్తిగా మార్చాల్సి వస్తోంది. అందుచేత కాలేయాన్ని సేకరించి అమర్చాల్సి ఉంటుంది. దీన్ని కాలేయ మార్పిడి అంటారు. 

కాలేయాన్ని గ్ర‌హీత శ‌రీరంలో అమ‌ర్చాక‌.. అది అక్క‌డ నెమ్మ‌దిగా ఇమిడిపోతుంది. ఇత‌ర అవ‌య‌వాల నుంచి సహాయం తీసుకొని కుదురుకొంటుంది. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా త‌న విధులు నిర్వ‌ర్తించ‌టం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. సాధారణంగా శ‌రీరంలోకి ఇత‌రుల అవ‌య‌వాలు ప్ర‌వేశిస్తే.. దేహం దాన్ని తిర‌స్క‌రిస్తుంది. ఇటువంటి ప‌రిస్థితి చోటుచేసుకోకుండా ఉండేందుకు ఇమ్యునో స‌ప్రెసివ్ మందులు వాడాల్సి ఉంటుంది. త‌క్కువ ఇమ్యూనోజెనిక్ సామ‌ర్థ్యం క‌ల అవ‌య‌వంగా కాలేయాన్ని చెబుతారు. అందుచేత ఎక్కువ కాలం ఈ మందుల్ని వాడుతున్నా..చౌక‌గానే సాధ్యం అని గుర్తించుకోవాలి. ఇటువంటి ఆప‌రేష‌న్ ల‌లో త‌ర‌చుగా వ‌చ్చే సైడ్ ఎఫెక్టు గా ఇన్ ఫెక్ష‌న్ ను చెబుతారు. అందుచేత కాలేయ మార్పిడికి ముందుగానే వైర‌ల్‌, బ్యాక్టీరియా ఇన్ ఫెక్ష‌న్ సోక‌కుండా టీకాల్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ లు విజ‌య‌వంతం అవుతున్న‌ట్లుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇటువంటి రోగులు ..మిగిలిన రోజుల్లో అవ‌స‌రం అయిన‌ప్పుడ‌ల్లా వైద్యుల సాయం తీసుకోవాలి.
మొత్తం మీద కాలేయ మార్పిడికి సంబంధించిన అవ‌గాహ‌న స‌మాజంలో బాగా పెర‌గాల్సి ఉంటుంది. కాలేయ వ్యాధుల చికిత్స‌లో అనేక మెడిక‌ల్‌, స‌ర్జిక‌ల్ విధానాలు ఉన్నాయ‌ని గుర్తించాలి. వీటిలో కాలేయ మార్పిడి కీల‌క‌మైంద‌ని తెలుసుకోవాలి. దీనిప‌ట్ల అపోహ‌లు తొల‌గించాల్సి ఉంది. మ‌ర‌ణం త‌ర్వాత అవ‌య‌వాలు దానం చేసే క‌ల్చ‌ర్ పెర‌గాలి. ఇందుకు స్వ‌చ్ఛందంగా ముందుకు రావాలి. అదే స‌మ‌యంలో స‌రైన చ‌ట్టాలు చేయ‌టం ద్వారా ప్ర‌భుత్వాలు కూడా అనుమతించాలి. సుదీర్ఘ రోగాల్ని న‌యం చేసే క్ర‌మంలో అవ‌య‌వ మార్పిడి అనేది ఒక స‌మర్థ‌వంత మైన విధానంగా ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలి.