క్యాలండర్ లో కొన్ని రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆయా రోజుల్లో ఆయా ప్రత్యేకతలను గుర్తు చేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. ఈ సందర్భంగా ఇవ్వాల్టి ప్రత్యేకతను మీకు గుర్తు చేస్తున్నాం.
ప్రతీ ఏటా జూలై ఒకటో తేదీన డాక్టర్స్ డే గా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా మీకు డాక్టర్స్ కమ్యూనిటీ తరపున శుభాకాంక్షలు..
ప్రముఖ వైద్యులు డాక్టర్ బిదన్ చంద్ర రాయ్ జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఈ రోజున డాక్టర్స్ డే గా పాటిస్తున్నాం. వైద్యుల్లో దృవ తారగా డాక్టర్ రాయ్ ను చెబుతారు. భారత్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థాపించి వైద్యుల సమైక్యత కోసం కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత పశ్చిమ బెంగాల్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం భారత రత్న తో సత్కరించింది.
డాక్టర్స్ డే సందర్భంగా ఒక ముఖ్య విషయాన్ని గుర్తు చేసుకొందాం..సమాజంలో కనిపించే వ్యాధుల్లో మూడు నుంచి నాలుగో వంతు దాకా వ్యాధుల్ని ముందుగానే నివారించవచ్చు. మానవ చర్యల కారణంగా ఈ రోగాలు పెచ్చు మీరుతున్నాయి. పొగ తాగటం, మద్యం తీసుకోవటం, గుట్కాలు నమలటం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు క్రమబద్దీకరించుకోవాలి. తగిన వ్యాయామం, సరిపడ విశ్రాంతి, ఆందోళనలు లేని జీవనాన్ని అలవర్చు కోవాలి. సమాజమంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకొంటూ.. మరోసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు....
Dhanya vadaalu Doctor garu, Meeku Doctor Day Subhakankshalu
ReplyDelete