గతంతో పోలిస్తే ఆధునిక కాలంలో కాలేయ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. అల్సర్ లు,
కామెర్లు, సిర్రోసిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయని
వివరించారు. ఆధునిక జీవన శైలితో ఏర్పడే ఒత్తిళ్లు, ఒడిదుడుకుల జీవితంతో
పాటు మద్యపానం వంటి చెడు అలవాట్లు ఇందుకు కారణం అవుతున్నాయని
వివరించారు. జీర్ణకోశ కాలేయ వ్యాధులపై నగర వాసులకు అవగాహన
కార్యక్రమం ఏర్పాటైంది. హైదరాబాద్ దోమల్ గుడా లోని సాయివాణి ఆస్పత్రి
ప్రాంగణంలో జాతీయ స్థాయిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో
ఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ సంస్థ ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఏర్పాటైన
అవగాహన కార్యక్రమంలో జీర్ణ కోశ మరియు కాలేయ వ్యాధులు విజ్రంభిస్తున్న
తీరు ని వైద్య నిపుణులు వివరించారు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిళ్లు,
నిర్ణీత సమయానికి ఆహారం తీసుకోకపోవటం , ఒకే చోట కూర్చొని ఎక్కువ సేపు
పనిచేయటం, హైరానా పడటం ఎక్కువగా జరగుతోంది. దీనికి తోడు పొగ తాగటం,
మద్యం తీసుకోవటం వంటి అలవాట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ కారణాలతో జీర్ణ
కోశ వ్యాధులు, కాలేయ వ్యాధులు ఎక్కువగా విజృంభిస్తున్నాయి. శరీరంలో
అత్యంత ఎక్కువ విస్తీర్ణం ఆక్రమించే వ్యవస్థ అయిన జీర్ణ వ్యవస్థ కు
సమస్యలు ఏర్పడితే ఇతర అవయవ వ్యవస్థ కూడా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇటువంటి రోగాల్ని ముందుగానే గమనించి సమర్థులైన వైద్య నిపుణుల దగ్గర
చికిత్స చేయించుకొంటే సమస్యల్ని నివారించవచ్చు.
జాతీయ జీర్ణ కోశ మరియు
కాలేయ వ్యాధుల వైద్య విజ్ఞాన సంస్థ వివరాల్ని సంస్థ డైరక్టర్ డాక్టర్
ఆర్. వి. రాఘవేంద్ర రావు వివరించారు. జీర్ణ కోశ వ్యాధుల్ని
గుర్తించేందుకు అవసరమైన అత్యాధునిక డయాగ్నస్టిక్ సౌకర్యాలు ఉన్నాయని
చెప్పారు. రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు జాతీయ అంతర్జాతీయ వైద్య
సంస్థ ల్లో శిక్షణ పొందిన డాక్టర్ సేతుబాబు, డాక్టర్ డీవీ శ్రీనివాస్,
డాక్టర్ వాసిఫ్ అలీ, డాక్టర్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ ఆకాష్ చౌదురి
అందుబాటులో ఉంటారు. జాతీయ స్థాయిలో పేరు గాంచిన ఈ వైద్య బృందం
ఎప్పటికప్పుడు రోగుల్ని పరీక్షిస్తూ మెరుగైన చికిత్స అందిస్తుంటుంది.
జీర్ణ కోశ వ్యాధుల
చికిత్స కు 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ డైరక్టర్
డాక్టర్ డీవీ శ్రీనివాస్ వెల్లడించారు. కాలేయ వ్యాధులకు ప్రత్యేక యూనిట్
తో పాటు సుశిక్షితులైన సిబ్బంది తో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుందని
వివరించారు. జీర్ణ కోశ వ్యాధులు, కాలేయ వ్యాధులకు అందుబాటు ధరల్లో
అత్యాధునిక చికిత్సను అందించటమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.
జీర్ణ కోశ వ్యాధులు,
కాలేయ వ్యాధులకు జాతీయ స్థాయి వైద్య విజ్ఞాన సంస్థ ను అందుబాటులోకి తేవటం
వెనుక వైద్య నిపుణులు కృషి ఉంది. ఈ కృషి ఫలితంగా అత్యాధునిక అద్భుత
వైద్య సేవలు హైదరాబాద్‌లోని సాయివాణి సూపర్ ష్పెషాలిటీ ఆస్పత్రి
ప్రాంగణంలోకి అందుబాటులోకి వచ్చాయి.
usefull information sir
ReplyDeleteమీ బ్లాగుని పూదండ తో అనుసంధానించండి.
ReplyDeletewww.poodanda.blogspot.com