వానలు కురుస్తున్నప్పుడు కొత్త నీరు వచ్చి చేరటం సహజం. ఈ సీజన్ లో కొన్ని రకాల
సమస్యల్ని చూసుకోవాలి. లేదంటే చిన్న ఇబ్బందులే పెద్ద సమస్యలకు దారి తీస్తాయి.
అటువంటి వాటిలో తాగునీటి విషయం ఒకటి. తాగునీరు తాగటం అందరికీ తప్పనిసరి. కానీ ఈ
నీరు పరిశుభ్రంగా ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మన పల్లెల్లో, పట్టణాల్లో తాగునీరు
సరఫరా చేసే పైప్ లైన్లు, మురుగు నీటిని తీసుకొని వెళ్లే పైప్ లైన్లు పక్క పక్కనే
ప్రవహిస్తుంటాయి. స్నేహితుల మాదిరిగా ఒక్కోసారి పలకరించుకొంటూ ఉంటాయి.
అటువంటప్పుడు పారిశుద్య గొట్టాల్లోని మురుగు నీరు .. తాగునీటిలో కలిసిపోయే అవకాశం
ఉంది. అప్పుడు తాగునీరు కలుషితం అయిపోతుంది. కొన్ని సందర్బాల్లో ఈ విషయం బయట
పడినా, చాలా సార్లు ఇది బయట పడదు. అటువంటప్పుడు కలుషిత నీటిని తాగిన వారంతా
ఇబ్బంది పడతారు.
కలుషిత నీటితో డయేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తుంటాయి. దీంతో పాటు
కామెర్లు, కలరా వంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. వందలాది వ్యాధి కారక క్రిములు
తాగునీటితోనే వ్యాపిస్తాయని అంచనా. అటువంటప్పుడు ఈ రోగ కారక క్రిములు తేలిగ్గా
వచ్చి పడతాయి. వీటితో ప్రమాదకరమైన వ్యాధులు వస్తుంటాయి. అందుచేత ఈ వ్యాధుల విషయంలో
జాగ్రత్తగా ఉండాలి.
ఈ సీజన్ లో శుద్ది చేసిన నీటినే తీసుకోవాలి. తాగునీటిని కాచిచల్లార్చాక తాగటం
ఉత్తమం. లేదా నాణ్యత కలిగిన ఫిల్టర్ లో వడపోసి తీసుకోవాలి. ఈ జాగ్రత్త తీసుకొంటే క్లీన్ వాటర్ ను పొందగలం.
అప్పుడు ఈ సీజన్ లో క్లీన్ గా ఉండగలం.
No comments:
Post a Comment