ఐస్ క్రీమ్ అనగానే అందరికీ కళ్ల ముందు కళ కళ లాడే ఐస్ క్రీమ్ లు కదలాడుతాయి. వాటిని ఊహించుకొంటే భలే ఉంటుంది కదా..అందుకే ఐస్ క్రీమ్ అనే పదం కూడా ఇంగ్లీషు పదం అయినప్పటికీ తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. చాలా సందర్భాల్లో దీన్ని వాడుతున్నారు.
ఐస్ క్రీమ్ ను పెద్దల కన్నా పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. నచ్చితే 2,3 లాగించేస్తారు. సాలిడ్ ఫుడ్ విషయంలో అడ్డు చెప్పే తల్లిదండ్రులు కూడా ఐస్ క్రీమ్ విషయంలో పెద్ద గా అడ్డు చెప్పరు. పోనీలే అని వదిలేస్తుంటారు. చల్లటి ఐస్ క్రీమ్ అప్పుడప్పుడు తినటంలో తప్పు లేదు. కాల్షియం, పాలు వంటివి ఉంటాయి కాబట్టి రుచిని ఇష్టపడతారు కాబట్టి ఊరుకోవచ్చు.
కానీ 2,3 ఐస్ క్రీమ్ లు లాగిస్తుంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఐస్ క్రీమ్ తో కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. ఒక కప్పుడు ఐస్ క్రీమ్ లో 10 గ్రాముల దాకా కొవ్వు పదార్థాలు ఉంటాయి. వీటిని పదే పదే లాగిస్తుంటే ఇవి శరీరంలో పోగు పడతాయి. దీంతో ఊబకాయం వచ్చేస్తుంది. దీంతో పాటు అనేక సమస్యలు వస్తాయి. గుండె సంబంధిత సమస్యలు, ఆయాసం ఒకటేమిటి..బోలెడన్ని సమస్యలు ఉంటాయి. బొద్దుగా ఉండే పిల్లలు చాలా వరకు ఐస్ క్రీమ్ లు లాగిస్తారంటే అతిశయోక్తి కాదు. తీపి కోసం సుగర్స్ దట్టిస్తారు. ముఖ్యంగా కృత్రిమ సుగర్స్ బాగా వేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. అంతే కాకుండా రుచి కోసం వాడే కెమికల్స్ తో కూడా సమస్యలు ఉంటాయి.
మొత్తం మీద ముందే చెప్పినట్లుగా అప్పుడప్పుడు ఒక ఐస్ క్రీమ్ లాగించటం తప్పు కాదు కానీ, అదే పనిగా 2,3 ఐస్ క్రీమ్ లు లాగించటం అంత మంచిది కాదనుకోవచ్చు.

No comments:
Post a Comment