మనలో చాలామంది వాయిదా వేసే పనుల్లో వాకింగ్ ఒకటి. నగర జీవనానికి అలవాటు పడిపోయిన వాళ్లలో శారీరక వ్యాయామం తగ్గిపోతోందని మెడికల్ సైన్స్ చెబుతోంది. అందుచేత ప్రతీ రోజు తేలికైన వ్యాయామం తప్పనిసరి అని గుర్తించుకోవాలి. ఇందులో తేలిక అయినది వాకింగ్ అనుకోవచ్చు. ప్రతీ రోజు 20 నుంచి 30 నిముషాల పాటు నడవటంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
దీంతో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. అందుచేత గుండె, ఊపిరితిత్తులు సజావుగా పనిచేస్తాయి. అంతే గాకుండా కొవ్వులు బాగా కరుగుతాయి. వీటితో వచ్చే అనేకానేక సమస్యలు నివారించటానికి వీలవుతుంది. రక్త పోటు, మధుమేహం వంటి దీర్ఘ కాలిక సమస్యలు ఉన్న వారు తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిందే. అప్పుడే మందులు సజావుగా పని చేస్తాయి. దీంతో పాటు ఎముకల పటిష్టతకు, బ్యాలెన్సింగ్ కు నడగ చాలా మంచిది. కండరాలు పటిష్టతకు, జీర్ణ ప్రక్రియ పటిష్టతకు ఇది ఉపయోగ పడుతుంది.
ఇంకెందుకు ఆలస్యం. వాయిదాలు మానేసి నడకకు జై కొడదామా..
No comments:
Post a Comment