చూసేందుకు కళ్లు ఉన్నాయి కాబట్టి వాటికి పని చెప్పిచూస్తూనే ఉంటాం కానీ కొన్ని సార్లు మాత్రం మెలకువ ఉండాలి. అంతెందుకు, టెలివిజన్ చూడటం అన్నది అందరికీ తప్పనిసరి అలవాటు. ఒక ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన జాబితాలో టెలివిజన్ ఎప్పుడో చేరిపోయింది. ఇప్పుడు తాజాగా కంప్యూటర్, దానికి ఇంటర్ నెట్ కనెక్షన్ తోడయ్యాయి. మరి వీటిని చూస్తూనే మిగిలిన పనులు చేసుకోవటం అలవాటైంది.
ముఖ్యంగా పిల్లలు బాగా టీవీలకు, కంప్యూటర్ లకు అలవాటు పడుతున్నారు. పెద్దల్లో కూడా చాలామంది టీవీ చూస్తూ పనులు చేసుకోవటం అలవాటు చేసుకొంటున్నారు. దీని కారణంగా లాభాలు ఎన్ని ఉన్నాయి అనే దానికి జవాబు కష్టం కానీ, అనర్థాలు మాత్రం అధికంగా ఉన్నాయని చెప్పక తప్పదు. టీవీ చూస్తూ టిఫిన్, భోజనం చేసే అలవాటు చాలా మందికి ఉంది. దీంతో ఎంత వడ్డించుకొంటున్నారో, ఎంత తింటున్నారో తెలియటం లేదు. దీని కారణంగా డైనింగ్‌టేబుల్ మీద ఎక్కువగా ఉండే అన్నం, స్వీట్లు, హాట్లు, పెరుగు వంటివి లాగించేయటం జరుగుతోంది. ఫలితంగా శరీరంలో కార్బొ హైడ్రేట్ లు, అంతకుమించి కొవ్వులు పేరుకొనిపోతున్నాయి. అదే సమయంలో భోజనం తర్వాత కొద్ది పాటి వ్యాయామం కూడాలేకుండాకూర్చొని టీవీలకు అతుక్కొని పోతున్నారు. దీంతో కదలిక పోవటంతో జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో కొవ్వులు ఎక్కడికక్కడ పేరుకొని పోతున్నాయి. మధ్యాహ్న సమయంలో భోజనం తర్వాత సోఫాలో కూలబడి కాలక్షేపం చేయటం, రాత్రి భోజనం తర్వాత నిద్ర వచ్చే వరకు టీవీలు, కంప్యూటర్ లుచూడటంతో ఒబేసిటీ సమస్య కూడా వచ్చి పడుతోంది.
ఈ అలవాట్లను ఎంత త్వరగా వదిలించుకొంటే అంత మంచిది. టీవీ చూడటం తప్పనిసరి అయితే భోజనం ముందే వడ్డించుకోండి. ఆహారం తీసుకొన్న తర్వాత తప్పనిసరిగా కొద్ది దూరం అయినా నడవటం లేదా కదలటం చేయాలి. దీంతో ఆహారం సరిగ్గా వంట పడుతుంది. ఎక్కువగా కొవ్వులు, పిండి పదార్థాల జోలికి పోకుండా ఉండగలుగుతారు. అదేసమయంలో కూరగాయలు, పండ్ల శాతం పెంచండి. మంచి ఆహారం వంట బడుతుంది.
No comments:
Post a Comment