...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

కాలేయ సంరక్షణ.. మీ చేతుల్లో..!

మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం కాలేయం. దాదాపు 500 కు పైగా జీవన క్రియల్లో ఇది  పాలు పంచుకొంటుంది. ప్రధానంగా జీర్ణ వ్యవకస్థలో చురుకైన పాత్ర పోషిస్తుంది.
అయితే కాలేయాన్ని సంరక్షించుకోవటం అన్నది మన చేతుల్లోనే ఉన్నది. ముఖ్యంగా ఆహార నియమాలు, అంతకు మించి ఆరోగ్యకరమైన అలవాట్లు అని గుర్తించుకోవాలి.


ఆధునిక కాలంలో మద్యం తాగటం అన్నది ఫ్యాషన్ గా మారుతోంది. ఈ తాగుడుకి బానిస అయినవారిలో విష పదార్థాలు పోగు పడతాయి. ఇవి క్రమంగా కాలేయాన్ని చేరి అక్కడ తిష్ట వేస్తాయి. పేరుకు తగినట్లుగానే ఈ చెడు పదార్థాలు క్రమ క్రమంగా సజీవ కణజాలాన్ని తినేస్తుంటాయి. దీంతో కాలేయం పాడై పోయి సిర్రోసిస్ లేదా క్యాన్సర్ వంటి పరిస్థితికి దారి తీస్తుంది.

అందుకే కాలేయాన్ని సంరక్షించుకోవటంలో ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రధానం అని గుర్తించుకోవాలి. మద్యం తాగటం అన్నది ఎప్పటికైనా ప్రమాదకరమైన అలవాటుగా భావించాలి. అందుచేత మద్యం కు దూరంగా ఉండటం మేలు. అంతే గాకుండా భారత్ వంటి సాంప్రదాయిక సమాాజాల్లో కుటుంబంలోని పెద్దలు ఏ పనిచేస్తుంటే, పిల్లలు వాటిని అనుసరిస్తుంటారు. అందుచేత పెద్దలకు మద్యం తాగే అలవాటు ఉంటే అది  క్రమంగా పిల్లలకు సంక్రమిస్తుంది. దీంతో తర తరాలుగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. 

మన ఆరోగ్యం మన చేతిలో.. !

వినటానికి కొంత అతిశయోక్తి లా ఉన్నా..ఇది నూటికి నూరుపాళ్లు నిజం. మన ఆరోగ్యాన్ని కాపాడుకొనే శక్తి మనకే ఉంది. ఇందుకు చేయాల్సింది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం. ఉదాహరణకు మన కెరీర్ లో కానీ, పని తీరులో కానీ సమయ పాలనకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అంటే కేటాయించిన పని ని నిర్దిష్ట వేళల్లో పూర్తి చేయటం అన్న మాట.

అలాగే మనం ఆహారం తీసుకోవటం విషయంలోనూ ఇదే రకమైన సమయ పాలన్ని పాటించాలి. అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ తీసుకోవటం వంటి నాలుగైదు సెగ్మంట్ లుగా ఆహారం తీసుకోవటం చాలా మందికి అలవాటు. ఈ అలవాటుని జాగ్రత్తగా పాటించాలి. అంటే ప్రతీ రోజు దాదాపుగా అదే సమయానికి ఆ రకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు ప్రతీ రోజు ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేసి ఆఫీసుకి వెళ్లటం లేదంటే ఇంటి పని చేసుకోవటం అలవాటు ఉంటే అలాగే ఈ పనిని చేసుకోవాలన్న మాట.
దీని వల్ల క్రమం తప్పకుండా ఆహారం సక్రమంగా జీర్ణం అయి, జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. శరీరానికి క్రమం తప్పకుండా శక్తి అందుతుంది.


క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోండి..!




ప్రపంచ క్యాన్సర్ డే. అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు క్యాన్సర్ గురించి తెలుసుకొనే రోజు అన్నమాట.
వాస్తవానికి క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. ఇది సరి కాదు. శరీరంలో ఏదో ఒక భాగంలో అవాంఛనీయ కణజాలం పేరుకొనిపోయి కణితిగా మారుతుంది. ఇది క్రమేపి పెరిగిపోయి సజీవ కణజాలాన్ని తినివేస్తూ విస్తరించటాన్ని క్యాన్సర్ అంటారు. కణితి లు అన్నీ క్యాన్సర్ కాదని గుర్తించుకోవాలి. ఇది శరీరంలోని ప్రధానభాగాలైన ఎముకలు, గొంతు, వంటి భాగాలతో పాటు జీర్ణావయవాలైన కడుపు, కాలేయం, క్లోమం వంటి భాగాల్లో ఏర్పడవచ్చు.
జీర్ణ వ్యవస్థ లో ఏర్పడే క్యాన్సర్ కు ఇప్పుడు చికిత్సలు లభిస్తున్నాయి. ర్యాడికల్ సర్జరీ ద్వారా క్యాన్సర్ ఏర్పడిన భాగాన్ని తొలగించి చికిత్స చేయటానికి వీలవుతుంది. దీంతో పాటు అడ్వాన్సు డ్ దశల్లో కీమో థెరపీ, రేడియో థెరపీ లు చేయటంతో పరిష్కారం చేయవచ్చు. క్యాన్సర్ లో మొదటి , మద్య దశ వరకు చికిత్సలు సాధ్యం అవుతున్నాయి. మరీ ముదిరిపోయిన దశలో కూడా నాణ్యమైన శేష జీవితాన్ని అందించటానికి వీలవుతుంది.


అమీబియాసిస్ కు అరవై కారణాలు

మన జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోనప్పుడు అమీబియాసిస్ వచ్చే అవకాశం ఉంది. నోటి ద్వారా కడుపులోకి తీసుకునే ఆహారం కారణంగానే ఈ వ్యాధి వస్తుంది. సహజంగా కలరాకు దారితీసే లక్షణాలన్నీ అమీబియాియాసిస్ కు దారితీస్తాయి. తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవడం ద్వారా అమీబియాసిస్ ను నియంత్రించవచ్చు.

                 పొగత్రాగడం, ఆల్కహాల్ సేవనం, గుట్కాలు, జర్దాలు, అమీబియాసిస్ ను మరింత పెంచుతాయి. పైగా కడుపులో అల్సర్లు రావడానికి కారణమౌతాయి.అమీబియాసిస్ లో పేగులు బాగా దెబ్బతింటాయి. దీని వల్ల దీర్ఘకాలం పాటు తిన్న ఆహారం జీర్ణం కాకుండా అలాగే ఉండిపోయి, సూక్ష్మజీవులకు నివాసస్థానంగా మారుతుంది. సూక్ష్మజీవులు పెరిగేకొద్దీ వ్యాధి తీవ్రత బాగా పెరుగుతుంది. 

కలరా వస్తే కలవరపడొద్దు

సాధారణంగా విరేచనాలు అవుతున్నాయని రోగులు డాక్టర్లకు చెబుతుంటారు. అయితే అన్ని విరేచనాలు ఒకేలా ఉండవు. అవి ఎప్పట్నుంచి అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి. విరేచనాల రంగు, వాసన ఎలా ఉందనే విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. వీటిని బట్టే డాక్టర్లు రోగికి చికిత్స విధానాన్ని నిర్ణయించగలుగుతారు. విరేచనాలకు ముందు రోగి ఏం తిన్నాడు, ఏ సమయంలో తిన్నాడనేది కూడా కలరా అవునో, కాదో నిర్థారించుకోవడానికి సహాయపడుతుంది.

                     కేవలం విరేచనాలు తగ్గించడానికి మందులివ్వడానికి ముందే.. రోగి గుండెపోటు, రక్తప్రసరణ సరిగ్గా ఉందో లేదో డాక్టర్లు అంచనా వేస్తారు. విరేచనాలు ఎలా అవుతున్నాయనే విషయాన్ని బట్టి.. అది కేవలం విరేచనాలో కాదో నిర్థారణకు వస్తారు. విరేచనాలతో పాటూ మూత్రం పడుతుంటే చాలా అపాయకరమైన పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. ఇక మూత్రం అయిన తర్వాత కూడా విరేచనాలు ఆగకపోతే అది మరింత ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయొచచ్చు. కలరా వచ్చినప్పుడు కలవరపడకుండా డాక్టర్ని సకాలంలో సంప్రదించడం ఉత్తమం.

అజీర్తే విరేచనాలకు మూలం

స్ప్రూ అనే విరేచనాల వ్యాధిలో అమిత దుర్వాసన ఉంటుంది. దీర్ఘకాలం విరేచనాలు ఉండటం వల్ల రోగి బరువు కోల్పోతాడు. ఇనుము వంటి పోషక పదార్ధాలు ఒంటికి వంటబట్టకపోవడంతో రోగి క్షీణించి పాలిపోతాడు. పాలు, గుడ్లు వంటివి సరిపడని శరీర తత్వం ఉన్న వ్యక్తులు జీర్ణశక్తి బాగా తక్కువగా ఉన్నప్పుడు అవి తీసుకుంటే.. తీవ్రమైన ఎలర్జీ లక్షణాలు వచ్చి విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

                         పేగులోపల విపరీతంగా పూసి పుళ్లు పడిపోయినప్పుడు అల్సరేటివ్ కోవైటిస్ అంటారు. రక్తంతో కూడిన విరేచనం, కడుపులో నొప్పి, జ్వరం ఉంటున్నప్పుడు పేగుల్లో ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని గమనించాలి. ఎపెండిసైడిటిస్ అనే కడుపు నొప్పితో కుడివైపుగజ్జల్లో నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లివర్ జబ్బుతో బాథపడే వ్యక్తికి కుడివైపు డొక్కల్లో నొప్పి వస్తుంది. పేగుల్లో ఏర్పడే తేడాల వల్ల విరేచనాలు, కడుపు నొప్పి వస్తాయి. 

కలరాతో జాగ్రత్త..!

ఆహారం ద్వారా, నీటిద్వారా కడుపులోకి చేరే హానికారక బ్యాక్టీరియా కారణంగా కలరా వస్తుంది. ఈ బ్యాక్టీరియా విరేచనాల వ్యాధికి కారణం అవుతాయి. కలరా ఊరంతా వ్యాపించినప్పుడు అతిసారం అంటారు. ఊళ్లో కలరా కేసులు ఉన్నాయని తెలిసినప్పుడు తక్కిన జనాభా అంతా కలరా వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. మానసిక వ్యాధులు, నాడీ సంబంధ వ్యాధులు కూడా ఈ వ్యాధి రావడానికి కారణం అవుతాయి.

        అమీబిక్ డిసెంట్రీ వంటి వ్యాధులు, పేగుల్లో టీబీ సూక్ష్మజీవుల వల్ల ఏ్పడే విరేచనాల వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశం ఉంది. జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి రావచ్చు. శరీరానికి సరిపడని ఆహారపదార్ధాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి స్థితి వస్తుంది. పేగుపూత, క్రిమిసంహారకాలు పొరపాటున ఆహారం ద్వారా కడుపులోకి వెళ్లడం వల్ల కూడా కలరా వస్తుంది.