...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

హాయిగా ఫుడ్డు తినండి.. చ‌క్కగా బ‌రువు త‌గ్గండి..!

బ‌రువు కి ఆహారానికి విడ‌దీయ‌రాని సంబంధం ఉంది. చాలామంది బ‌రువు త‌గ్గాలంటే ఆహారం తినటం త‌గ్గించాల‌ని అనుకొంటారు. ఇందులో కొంత వ‌ర‌కు వాస్తవం ఉంది. ఎక్కువ కొవ్వును మిగిల్చే ఆహారం తీసుకొంటే బ‌రువు పెర‌గ‌టం త‌థ్యం. ఇది స‌హ‌జ సూత్రం. అదే స‌మ‌యంలో ఆహారాన్ని త‌గ్గిస్తే మాత్రం కొంచెం ఇబ్బందే. శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలు అందించే ఆహారం తీసుకొంటూనే కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకొంటే మాత్రం నాజూకుగా మారిపోవ‌చ్చు.ఇందుకోసం ఉప‌క‌రించే ఆహారం ఇప్పుడు చూద్దాం..

1.ఆకు కూర‌లు.. ఆకు కూర‌ల‌తో చాలా ఉప‌యోగం ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. వీటిని తీసుకొంటే కొవ్వు బెడ‌ద ఉండ‌దు, కానీ చ‌క్కటి పోష‌కాలు, ల‌వ‌ణాలు అందుతాయి. నడుము భాగంలో కొవ్వు పేరుకొని పోతోంద‌ని బెంగ ప‌డే వారికి ఇది చ‌క్కటి ప‌రిష్కారం. నూనెలో వేయించ‌కుండా, నీటితో ఉడికించుకొని పొడి ఆహారంగా తీసుకొంటే కావాల్సిన ప్రయోజ‌నాలు పొంద‌వ‌చ్చు.
2. పాలు, మ‌జ్జిగ‌.. పెరుగు, మీగ‌డ‌ల‌తో కొవ్వు పెరిగే అవ‌కాశం ఉంది. కానీ, పాలు, ప‌ల్చటి మ‌జ్జిగ‌తో ఈ ఇబ్బంది ఉండ‌దు. పైగా శ‌రీరానికి కావ‌ల్సిన కాల్షియం అందుతుంది. కాల్షియం తో శ‌రీర ప‌టుత్వం సాధ్యం అవుతుంది.
3. గుడ్లు.. గుడ్డు ఎక్కువ‌గా తీసుకొంటే ప్రొటీన్స్ ఎక్కువ‌గా చేర‌తాయి. కండ‌రాలు గట్టి ప‌డేందుకు ఇది చాలా అవ‌స‌రం. విటమిన్ బీ 12, తో పాటు ఎనిమిదిర‌కాల ల‌వ‌ణాలు, కాల్షియం, ఐర‌న్ వంటి పోష‌కాలు ల‌భిస్తాయి. జీవ‌న‌క్రియ‌లు సాఫీ గా జ‌రిగేందుకు అవ‌స‌ర‌మైన అన్ని అంశాలు గుడ్డులో దొర‌కుతాయి.

4. చేప‌లు.. మాంసాహారంలో కోడిమాంసం, మేక మాంసం వంటి వాటిక‌న్నా చేప‌లు మేలు అని చెబుతారు. వీటితో కొవ్వులు క‌ర‌గ‌టంతో పాటు ప్రోటీన్లు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ఒత్తిడి సంబంధిత ర‌సాయ‌నాలు పేరుకోకుండా నిరోధించ‌టం ద్వారా లావు కాకుండా నివారించ‌వ‌చ్చు. చ‌క్కటి ల‌వ‌ణాలు ల‌భించ‌టం మ‌రో ఉప‌యోగ‌క‌ర‌మైన అంశం.
5. గ్రీన్ టీ.. తాజా గ్రీన్ టీ తో ఉత్సాహం క‌లుగుతుంది. మెద‌డు చురుగ్గా ఉండ‌టం ద్వారా అన‌వ‌స‌ర‌పు ర‌సాయ‌నాల స్రావ‌కాన్ని నిరోధించ‌వ‌చ్చు.
శ‌రీరంలో అన‌వ‌స‌ర‌పు నిల్వల్ని తొల‌గించ‌టంలో గ్రీన్ టీ ఉప‌క‌రిస్తుంది.
ఈ ఐదు ర‌కాల ఆహారాన్ని తీసుకోవ‌టం ఎంత ముఖ్యమో, కొవ్వును మిగిల్చే జంక్ ఫుడ్ ల‌కు దూరంగా ఉండ‌టం అంత ప్రధానం. ఐస్ క్రీమ్‌లు, బ‌ర్గర్ల, స్వీట్స్ ను దూరం పెడితే బ‌రువు త‌గ్గటం సాధ్యం అవుతుంది.

3 comments:

  1. chaalaachakkani salahaalichchaaru .abhinamdanalu

    ReplyDelete
  2. ఈ గ్రీన్ టీ, Gensingల మీద అవేవో సర్వరోగ నివారిణిలు అయినట్టు చైనీస్ ట్రెడిషనల్ మెడిసన్‌లో ప్రచారాలు చూస్తుంటాము. మనం తాగే బ్లాక్ టీ, ఈ గ్రీన్ టీలమధ్య అంత తేడా ఎందుకు, దయచేసి వివరిస్తారా? మా బంధువొకావిడ గ్రీన్టీ కొన్ని ఏళ్ళుగా తాగుతున్నారు, పాపం సన్నబడట్లేదు.

    ReplyDelete