ఇటీవల కాలంలో తాగునీటి మీద అవగాహన పెరిగింది.గతంతో పోల్చుకొంటే నీటిని ఎక్కువగా తీసుకోవటం అలవాటుగా మార్చుకొంటున్నారు. శరీరానికి నీరు చాలా అత్యవసర అంశం అనటంలో ఎటువంటి సందేహం లేదు పైగా వివిధ రకాల జీవన క్రియలు సాఫీగా జరగటానికి తాగునీరు చాలా బాగా ఉపయోగ పడుతుంది. అదే సమయంలో చాలినంత నీరు ఉంటే జీవనానికి సరిపోతుంది. అదే పనిగా నీరు తాగితే మాత్రం ఇబ్బంది తప్పదు.
సగటున మానవునికి ఒక రోజుకి మూడు లీటర్ల నీరు సరిపోతుంది. నేరుగా తీసుకొనే నీటితో పాటు అడపా దడపా ఆహార పదార్థాల రూపంలో కూడా నీరు అందుతుంది. ఈ మాత్రం నీరు సరిపోతుంది. ఇంతకు మించితే మాత్రం జీర్ణాశయం, కాలేయం మరియు మూత్ర పిండాల పనితీరు మీద ప్రభావం చూపుతుంది. అక్కడ నీరు ఎక్కువగా పేరుకొని పోతే, ఇతర పదార్థాలు సక్రమంగా వినియోగించుకోవటం కష్టతరం అవుతుంది. ఉదాహరణకు జీర్ణాశయాన్ని తీసుకొంటే, కడుపులో సగం ఆహారం తీసుకొని, పావు భాగం నీటితో నింపి, పావు భాగాన్ని ఖాళీగా ఉంచుకోమని చెబుతారు. దీన్ని పాటించకుండా అదే పనిగా నీటితో నింపితే జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. దీంతో చిన్న ప్రేగుల మీద కూడా ఒత్తిడి ఏర్పడుతుంది.
పగటి పూట ఎక్కువగా నీరు తీసుకొంటే రాత్రి పూట ఈ నీటి వినియోగం తగ్గించుకొంటే సరిపోతుంది. దీంతో నీటి వినియోగం సమతుల్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. కానీ, నీటిని సరాసరిన లెక్కవేసుకొంటే చాలు.
డాక్టర్ గారు, ఓ డౌటు.
ReplyDeleteమన శరీరం తనకు ఎంత నీరు కావాలో నిర్ణయించుకోలేదా? అంటే 'కావాల్సినపుడు దాహం వేస్తుంది, దాహం తీరే దాకా తాగాలనిపిస్తే తాగుతాము' అని నియత్రించుకోదా? ఎందుకు ఇలా 8గ్లాసులు అంటూ నిర్ణయిస్తారు? నీరు పేరుకు పోవడం అంటే అవసరంలేని నీటిని ఆరోగ్యవంతమైన శరీరం బయటికి పంపించివేయదా?
వర్డ్ వెరిఫికేషన్ తొలగిస్తే సందేహానివృత్తి చేసుకోవడం పాఠకులకు సులభంగా వుంటుంది. ఈ వర్డ్ వెరిఫికేషన్ అనంది బ్లాగుల్లో శుద్ధ వేస్ట్ అని నా అభిప్రాయం.