ఒకప్పుడు క్యాన్సర్ అంటే పెద్ద వాళ్లలో వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్య గా భావించేవారు. ఇప్పుటి కాలంలో మాత్రం ఈ పరిస్థితి మారింది. ముఖ్యంగా లివర్ క్యాన్సర్ ఇటీవల కాలంలో చిన్నారుల్లో సైతం కనిపిస్తోంది. దీన్ని హెపటో బ్లాస్టోమా అంటారు. ఇది ప్రమాదకరమైనది. వెంటనే దీన్ని గుర్తించలేక పోవచ్చు. ఇది సాధారణంగా మూడేళ్ల లో పు చిన్నారుల్లో మాత్రమే తలెత్తుతుంది. వ్యాధి తలెత్తిన వెంటనే గుర్తించక పోతే సమస్య తీవ్రం అవుతుందని గుర్తించుకోవాలి.
జీర్ణ వ్యవస్థలో చురుకైన పాత్ర పోషించే అవయవం కాలేయం. ప్రోటీన్ సంశ్లేషణ, డ్రగ్ మెటబాలిజం, శరీర సమతుల్యత, విసర్జన తో పాటు రక్త కణాల్ని శిథిలం చేయటం వంటి పనులు చేస్తుంటుంది. దీనికి వచ్చే ముఖ్య సమస్యల్లో ప్రధానమైనది కాలేయ క్యాన్సర్. అవాంఛిత కణజాలం ఒక్క చోట పోగు పడి అంతకంతకూ పెరిగిపోవటాన్ని క్యాన్సర్ గా అభివర్ణిస్తాం. ప్రాథమిక మైన క్యాన్సర్ ను హెపటో సెల్యులార్ కార్సినోమా అంటారు. చిన్నారుల్లో దీన్ని హెపటో బ్లాస్టోమా అంటారు.
నిర్దిష్టమైన కారణాల్ని దీనికి చెప్పలేం. కొన్ని సార్లు కుటుంబ చరిత్ర కొంత వరకు కారణం కావచ్చు.
దురదృష్టవశాత్తు కాలేయ క్యాన్సర్ ముదిరిపోయే దాకా లక్షణాలు బయట పడవు. కాలేయం పెరిగినప్పుడు కడుపు ప్రాంతంలో వాపు కనిపిస్తుంది. చిన్న పిల్లలకు స్నానం చేయించేటప్పుడు తల్లిదండ్రులు తడిమి చూస్తే చేతికి తగిలే అవకాశం ఉంది.
క్యాన్సర్ ను గుర్తించటంలో జాగ్రత్త అవసరం. సీటీ స్కాన్, ఎమ్ ఆర్ ఐ స్కాన్ లతో పాటు తప్పనిసరైతే బయోప్సీ పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను గుర్తిస్తారు. ఆల్ఫా ఫీటో ప్రోటీన్ సీరమ్ వంటి రక్త పరీక్షలు కూడా అవసరం అవుతాయి. యాంజియోగ్రామ్, లాపరోస్కోపీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
క్యాన్సర్ కణాలు సూటిగా నాశనం చేసే ఆర్ ఎఫ్ ఏ చికిత్స, క్యాన్సర్ కణాల్ని గడ్డకట్టే విధంగా క్రయో చికిత్స వంటివి చేయాల్సి రావచ్చు. క్యాన్సర్ చికిత్సలో ర్యాడికల్ ఆపరేషన్ అన్నది ఉత్తమ చికిత్స అన్నది నిపుణుల అభిప్రాయం. ముదిరిన దశలో కీమో థెరపీ, రేడియో థెరపీ పద్దతుల్ని అనుసరించాలి.

No comments:
Post a Comment