చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో పరిస్థితులు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ వాతావరణం భలే గమ్మతుగా ఉంటుంది. చిన్నపిల్లల మీద అందరి దృష్టి ఉంటుంది. అటువంటప్పుడ వాళ్లు తిండి తినటం తగ్గించటం, పేచీ పెట్టడం వంటివి చేస్తుంటారు. అటువంటి సందర్భాల్ని తేలిగ్గా తీసుకోకూడదు. అందుకు కారణం ఏమిటో గమనించాలి.
పిల్లలు మట్టిలో ఆడటం, కింద తిరుగాడుతూ ఉండటం సాధారణం. అందుచేతనే ఇది కూడా చోటు చేసుకొంది అనుకొంటారు. కానీ పిల్లలు మట్టిలో తిరుగుతున్నప్పుడు ఆ మట్టిని తినే అవకాశం ఉంది. దీనికి అలవాటు పడిన చిన్నారులు ఏదో ఒకలా మట్టిని తింటుంటారు. దీని కారణంగా క్రిములు, సూక్ష్మమైన పాములు కడుపులో చేరతాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. క్రమంగా ఆకలి తగ్గిపోవటం, నీరసం, చిరాకులు, పేచీలు పెట్టడం వంటి లక్షణాలు చోటు చేసుకొంటాయి. అందుచేత ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదిస్తే మంచిది.

No comments:
Post a Comment