జీర్ణ వ్యవస్థలో చురుకైన పాత్ర పోషించే
అవయవం కాలేయం. ప్రోటీన్ సంశ్లేషణ, డ్రగ్ మెటబాలిజం, శరీర
సమతుల్యత, విసర్జన వంటి పనులు చేస్తుంటుంది. దీనికి వచ్చే ముఖ్య
సమస్యల్లో ప్రధానమైనది కాలేయ క్యాన్సర్. అవాంఛిత కణజాలం ఒక్క చోట
పేరుకోవటాన్ని క్యాన్సర్ గా అభివర్ణిస్తాం. ప్రాథమిక మైన క్యాన్సర్
ను హెపటో సెల్యులార్ కార్సినోమా అంటారు.మద్యపానం అలవాటు, హెపటైటిస్ బీ,
హెపటైటిస్ సీ వైరస్ ఇన్ ఫెక్షన్, సరైన జీవన శైలి లేకపోవటం,
పుట్టుకతో ఉండే జన్యులోపాలు వంటి కారణాలతో క్యాన్సర్ వస్తుంది.
కొంతమంది చిన్నారుల్లో కూడా క్యాన్సర్ వస్తుంటుంది. దీన్ని హెపటో బ్లాస్టోమా అంటారు. ఇది ప్రమాదకరమైనది.కానే కాదు. హెమాంజియా, ఎఫ్.ఎన్.హెచ్, అడినోమా వంటి కణితులు క్యాన్సర్ కణితులు కాదని గుర్తించుకోవాలి.
దురదృష్టవశాత్తు కాలేయ క్యాన్సర్ ముదిరిపోయే దాకా లక్షణాలు బయట పడవు. కడుపులో ఎగువ భాగంలో నొప్పి రావటం, బరువు తగ్గటం, ఆకలి తగ్గటం, బాగా నీరసంగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సార్లు కామెర్లు సోకి శరీరం, కళ్లు రంగు మారతాయి. కాలేయం పెరిగినప్పుడు కడుపు ప్రాంతంలో వాపు కనిపిస్తుంది. చిన్న పిల్లలకు స్నానం చేయించేటప్పుడు తల్లిదండ్రులు తడిమి చూస్తే చేతికి తగిలే అవకాశం ఉంది.క్యాన్సర్ ను గుర్తించటంలో జాగ్రత్త అవసరం. సీటీ స్కాన్, ఎమ్ ఆర్ ఐ స్కాన్ లతో పాటు తప్పనిసరైతే బయోప్సీ పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను గుర్తిస్తారు. సీరమ్ ఆల్ఫా ఫీటో ప్రోటీన్ వంటి రక్త పరీక్షలు కూడా అవసరం అవుతాయి. యాంజియోగ్రామ్, లాపరోస్కోపీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. క్యాన్సర్ కణాలు సూటిగా నాశనం చేసే ఆర్ ఎఫ్ ఏ చికిత్స, క్యాన్సర్ కణాల్ని గడ్డకట్టే విధంగా క్రయో చికిత్స వంటివి చేయవచ్చు. క్యాన్సర్ చికిత్సలో ర్యాడికల్ ఆపరేషన్ (హెపటెక్టమీ) అన్నది ఉత్తమ చికిత్స. ముదిరిన దశలో కీమో థెరపీ, రేడియో థెరపీ పద్దతుల్ని అనుసరించాలి.

No comments:
Post a Comment