ప్రత్యేక వాదన అంటే ఏమిటి... అసలు ఈ ప్రత్యేక వైఖరి ఎలా పుడుతుంది.. ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచన ఎలా మొగ్గ తొడుగుతుంది... ఇటువంటి విషయాల్ని ఆలోచిస్తే భలే గమ్మతైన జవాబు దొరకుతుంది. ఆలోచనలే మనిషిని నడిపిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆలోచనలు మొగ్గ తొడిగే క్రమంలో అసలు పరిణామాలు చోటు చేసుకొంటాయి. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని, జీవితంలో దూసుకు పోవాలన్న ఆలోచన.. ఇప్పటి తరానికి బాగా పెరిగిపోయింది. కెరీర్ లో టార్గెట్లు, వ్యక్తిగత జీవితంలో బడా ఆలోచనలు, ... వీటి నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లతో జీవితం సంక్లిష్టంగా మారిపోతోంది. ఈ ఒత్తిళ్లతో సకల అనారోగ్యాలు కొని తెచ్చుకోవటం అవుతోంది.
ఒత్తిళ్ల సమయంలో శరీరంలో ఆక్సిడెంట్స్ పుట్టుకొని వస్తుంటాయి. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవటం, కాలుష్యం పెరిగిపోవటం, ఫిట్ నెస్ లోపించటం వంటి సమస్యలు తోడవటంతో ఈ ఆక్సిడెంట్స్ చెలరేగిపోతాయి. ఈ ఒత్తిళ్లతో ఆక్సిడెంట్స్ కు పట్ట పగ్గాలు లేకుండా పోతాయి. దీంతో శరీరంలో నిస్త్రాణత పెరిగిపోవటంతో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో వ్యాధులు ఎక్కువగా అచ్చే అవకాశం ఏర్పడుతుంది. అంతిమంగా అనేక దీర్ఘకాలిక రోగాలకు నిలయంగా మారిపోవాల్సి ఉంటుంది.
ప్రత్యేకంగా కనిపించాలన్న తపనలో ఒత్తిడికి లోనై, అంతిమంగా అనారోగ్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి శరీరంలోనే పరిష్కారం ఉంది. ఆక్సిడెంట్స్ ను నిర్మూలించే యాంటీ ఆక్సిడెంట్ లను తయారు చేసుకొనే శక్తి శరీరానికి ఉంది. ఎటొచ్చీ మనం ఆ పని చేసుకొనేట్లుగా శరీరానికి అవకాశం కల్పించాలి. పచ్చటి ఆకుకూరలు, తాజా పండ్లతో శరీరంలో ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ తయారు అవుతాయి. టీ కాఫీలకు బదులు గ్రీన్ టీ తీసుకొంటే ఈ పని సులువు అవుతుంది. శరీరానికి వ్యాయామం లేకుండా, కేవలం మెదడుకి విపరీతంగా పని కల్పించటం తో ఆక్సిడెంట్స్ తయారవుతున్నాయని శాస్త్రీయంగా తేలింది. దీనికి విరుగుడుగా శరీరానికి వ్యాయామం కల్పించి, మెదడుకి కాస్తంత ఆహ్లాదం కల్పించటంతో పరిష్కారం దొరకుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించటం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లను సృష్టించుకోవచ్చు. అప్పుడు కెరీర్‌లోనూ, పర్సనల్ లైఫ్ లోనూ దూసుకెళ్లేందుకు వీలవుతుంది. సమాజంలో ప్రత్యేకతను హాయిగా సంపాదించుకోవచ్చు.
డాక్టర్ రాఘవేంద్ర గారు, విలువైన సమాచారాన్ని క్లుప్తంగా,చక్కగా చెప్పారు.ధన్యవాదాలు!
ReplyDeleteడాక్టర్ గారూ..! కామన్ మ్యాన్ కు అర్థమయ్యేట్లుగా విషయాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.. పాతికేళ్ల వయస్సుకే ఈ మధ్య ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి, కారణాలు, పరిష్కారాలు చెప్పండి..
ReplyDelete