మోసం చేయటం ఎదుటి వారి టాలంట్ మీద ఆధార పడి ఉంటుంది.కానీ, మోస పోవటం మాత్రం మన చేతకానితనం మీద ఆధారపడి ఉంటుంది. చాలా సార్లు ఇది రుజువైన వాస్తవం. ఇక, మన పాయింట్ కు వస్తే.. ఇటీవల కాలంలో బయటకు వెళ్లి ఫుడ్ తినటం కామన్ గా మారింది. వీకెండ్స్ లో కానీ, ప్రత్యేక సందర్భాల్లో కానీ కుటుంబంతో కలిసి హోటల్ కు వెళ్తుంటాం. బయట నగరాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా బయట ఫుడ్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇటువంటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే.
చాలా సందర్భాల్లో డాబుగా, అందంగా తీర్చిదిద్దిన డైనింగ్ రూమ్ ఉన్న హోటల్ ను ప్రిఫర్ చేస్తాం. టిక్ టాప్ గా తయారైన వెయిటర్లు, లైటింగ్ కాంతులతో మెరిసిపోయే టేబుల్స్ ఉంటే సంతోషిస్తాం. కానీ, అంతకన్నా ముఖ్యంగా చూడవలసినది ఒకటి ఉంది. అదేమిటంటే కిచెన్ రూమ్ పరిస్థితి. నగరాల్లో వంటగదిని చూసే అవకాశం హోటల్ యాజమాన్యం ఇవ్వనే ఇవ్వదు. అనేక ప్రముఖ హోటల్స్ సైతం డైనింగ్ రూమ్ ను బ్రహ్మాండంగా అలంకరిస్తాయి తప్పితే, వంట గది ని చాలా అధ్వానంగా ఉంచుతాయి. ఏదో నూటికి ఒక్కసారి వెళ్లేప్పుడు సంగతి కానీ, పొరుగూరిలో పరిస్థితి కానీ.. పక్కన పెడితే సొంత ఊర్లో రెగ్యులర్ గా వెళ్లేప్పుడు మాత్రం ఈ విషయాన్ని తప్పనిసరిగా చెక్ చూసుకోవాలి. అపరిశుభ్ర పరిస్థితుల్లో వంట చేసినప్పుడు ఆ ఆహారంలో సూక్ష్మ క్రిములు కలిసి పోతాయి. వీటిని తీసుకొన్నప్పుడు కొన్నిసార్లు వెంటనే ప్రభావం చూపుతాయి. మరికొన్ని సార్లు ఈ ఫుడ్ లోపల దాగి ఉన్న క్రిములు కాస్త రెస్ట్ తీసుకొని ఆ తర్వాత విజృంభిస్తాయి. అంతిమంగా అనారోగ్యం పాలవ్వాల్సి ఉంటుంది.
జనరల్ గా ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు వెయిటర్ ఒపీనియన్ తీసుకొనటం అలవాటు. చాలాసార్లు అక్కడ రెడీగా ఫుడ్ ను వెయిటర్ చెప్పేస్తుంటారు. దాన్ని ఫాలో అవకుండా మనం ఏది తినదలచుకొన్నామో ఆలోచించుకొని ఆర్డర్ చేయటం మేలు. మనం ఏది ఇష్ట పడతామో, అంతకు మించి పరిశుభ్రంగా ఉండే ఆహారం ఏమిటో వెదక్కొని ఫుడ్ తీసుకోవటం మేలు. అప్పుడే ఎదుటివారి చేతిలోమోసపోకుండా ఉండగలుగుతాం.
No comments:
Post a Comment