సడెన్ గా ఈ అవార్డుల హడావుడి ఏమిటి.. అన్న ప్రశ్న రావచ్చు. కానీ, ఈ విషయాన్ని అంతటితో వదిలేయటమూ సరి కాదు. ఎందుచేతనంటే అవార్డులు అంటే ప్రోత్సాహకాలు అని అంతా భావిస్తారు. అటువంటప్పుడు అవార్డులు దక్కిన సందర్భాన్ని, సహేతుక కారణాన్ని అంతా తెలుసుకోవటం మేలు. అప్పుడే అవార్డుల గురించి పూర్తిగా వివరణ లభిస్తుంది..
మద్యం తాగటాన్ని ఇప్పటి తరం చాలా కామన్‌గా తీసుకొంటున్నారు. దీన్నిసమర్థించుకొనేందుకు కొన్ని కారణాలు రెడీ గా ఉంచుకొంటారు. ఇప్పుడు ఆ కారణాలు చూద్దాం.
1. తక్కువ మోతాదులో తీసుకొంటే ఏమీ కాదు.. ఇది సరైనది కాదు. తక్కువ అనే దానికి కొలబద్ద లేదు. శరీరానికి మద్యం తాగటం అలవాటైతే దానికి కళ్లెం వేయటం కష్టం అవుతుంది. కొద్ది గా తాగటం మొదలెట్టి తర్వాత విజృంభించిన వారు ఉన్నారు.
2. తండ్రి, తాతలు బాగా తాగేవారు, వాళ్లకు ఏమీ కాలేదు కాబట్టి మాకూ ఏమీ కాదనే వాదన.. ఇందులో నిజం లేదు. ఎందుకంటే శరీరంలో మద్యం ప్రవేశించాక జరగాల్సిన అనర్థం జరుగుతునే ఉంటుంది. బహుశా పెద్దల్లో వారి శారీరక పటిష్టత రీత్యా అనర్థాలు బయట పడి ఉండక పోవచ్చు కానీ ఇబ్బందులు మాత్రం తప్పదు. ఆల్కహాలిక్ డీ హైడ్రోజినేజ్ ఎంజైమ్‌ల స్రావకం తో పెద్దగా అనర్థం లేకుండా ఉండవచ్చు.
3. వైన్ తాగితే మేలు.. మద్యం ఏ రూపంలో తీసుకొన్నా అనర్థమే. వైన్ తాగటం తో కొన్ని మార్గాల్లో లాభసాటి కావచ్చు. కానీ, మొత్తంగా ఆలోచిస్తే మాత్రం శరీరానికి సమస్యలు తప్పవు.
4. వీకెండ్ పార్టీల్లోనే తాగుతుంటాం.. ఇది కూడా సరైన వాదన కాదు. వీకెండ్ ఫార్టీలు, వీక్ డెస్ సిట్టింగ్‌లు అన్నవి మన ఆలోచనలకు తెలిసినవి. కానీ శరీరం అనేది ఒక బయో కెమికల్ సమ్మేళనం. దీనికి ఈ వాదనలు అప్లయ్ కావు. మద్యం ఎప్పుడు తీసుకొన్నా డామేజీ జరిగిపోతుంది.
ఇన్ని కారణాలు చూసిన తర్వాత మద్యం తాగటానికి పూర్తిగా దూరంగా ఉండటం ఒక్కటే సరైన విధానం అన్న సంగతి అర్థం అవుతుంది. సమర్థించుకొనే కారణాలు ఎలా ఉన్నా... అంతిమంగా ఆలోచించాల్సిన సూత్రం అదే. మద్యానికి దూరంగా ఉంటే కుటుంబ సభ్యుల మన్ననలు పొందవచ్చు. కుటుంబ సభ్యుల మన్ననల్ని మించిన అవార్డు ఉంటుందా...!
మీరు చెప్పిన మంచి కంటినుంచీ మెదడు ఆ తరువాత గుండెకు చేరి అందరూ మంచికి దగ్గర అవుతారు అని ఆశిస్తున్న
ReplyDelete