సమాజంలోచిత్రం భలే ప్రభావం చూపుతుంది. ఎందుకంటే దృశ్య మాధ్యమం చాలా ప్రభావం శీలి. అటువంటప్పుడు ఒక చిత్రం ద్వారా ఎన్నో విషయాల్ని పంపించవచ్చు. ఆ చిత్రాన్ని ఉపయోగించుకొనే తీరులోనే ఎంతో గమ్మతు ఉంది. దాన్ని అర్థం చేసుకొంటే భలే విషయాలు బోధ పడతాయి. ఇంతకీ ఈ చిత్రాన్ని చూస్తే మీకు అంతా అర్థం అవుతుంది.
ఇటీవల కాలంలో పాశ్చాత్య దేశాల్లో ఈ చిత్రం బాగా ప్రాచుర్యం పొందింది. మద్యం తాగటం వల్ల వచ్చే అనర్థాల్ని ఒక్క చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం ఇది. జాగ్రత్తగా గమనిస్తే... డజనుకి పైగా శరీరావయవాలు మద్యం కారణంగా ఎఫెక్ట్ అవుతాయి. తాగుడు ఎక్కువైతే మెదడు మొద్దుబారుతుంది. అక్కడ సరైన నిర్ణయాలు లేకుండా పోతాయి. కంటి చూపుకి కూడా ఇబ్బంది తప్పదు. మాట తడబాటుతో మద్యం అలవాటు బయటకు పొక్కుతుంది. ఇదంతా జనరల్ గా జరిగిపోయేవి. కానీ గొంతు, శ్వాస నాళాల్లో ఇన్ ఫెక్షన్ సోకుతుంది. దీంతో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. రక్తంలో విషతుల్యత పెరిగి గుండె మీద ప్రభావం చూపుతుంది. కడుపులో అల్సర్ లు ఏర్పడుతాయి. శరీరంలోని ప్రధానమైన అవయవంగా చెప్పుకొనే కాలేయం లో అనేక అనర్థాలు ఏర్పడుతాయి.(మద్యంతో కాలేయం లో ఏర్పడే అనర్ధాల్ని వేరే పోస్ట్ లో చూద్దాం.) కండరాల బలహీనత, ఎముకల్లో ఆస్టియోపోరోసిస్ వంటి దుష్ఫలితాలు కనిపిస్తాయి. జీర్ణనాళాల్లో అల్సర్స్, క్యాన్సర్ ఏర్పడవచ్చు. వంధ్యత్వానికి కూడా దారితీయవచ్చని తాజా ఫలితాలు చెబుతున్నాయి.
ఇన్ని చెడు ఫలితాలు కలిగించే మద్యాన్ని తాగటం ఎంత వరకు సబబు అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. మద్యపానానికి దూరంగా ఉంటే అన్ని అవయవాలకు మంచిది. లేదంటే అన్ని భాగాలకు అనర్థమే. ఇన్ని విషయాల్ని ఒక్క చిత్రం లో చూపించటం గొప్పతనమే కదా. అందుచేత ఈ చిత్రానికి అంత సీన్ ఉందా అన్న అపనమ్మకమే అవసరం లేదు. ఇది నిజంగానే వండర్‌ఫుల్ చిత్రం..!

No comments:
Post a Comment