ఏ విషయం అయినా శాస్త్రీయంగా ఆలోచిస్తే చక్కటి పరిష్కారం దొరకుతుంది. నాటు పద్దతిలో ఎదుర్కొంటే మాత్రం ఇబ్బంది తప్పదు.
జీర్ణ వ్యవస్థ లో ఇబ్బంది పెట్టే కామెర్లు వంటి వ్యాధులకు కొంత మంది వైద్యం చేయించుకొనేందుకు ఇష్టం చూపరు. నాటు పద్దతిలో మూలికలు, చెక్క మందును వాడేందుకు ఆసక్తి చూపుతారు. దీని కారణంగానే కామెర్లు నయం అవుతాయని నమ్ముతారు. వాస్తవానికి కొన్ని రకాల కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. మందులు వాడినా, వాడకపోయినా తగ్గిపోతాయి. ఇటువంటప్పుడు మూలికలు, చెక్క మందులు వంటివి వాడినప్పుడు సహజంగా ఉండే శరీర వ్యాధి నిరోధక శక్తితో నివారణ అయిపోతుంది. కానీ వీటి వలననే కామెర్లు తగ్గాయని భావిస్తారు. దీని గురించి ప్రచారం చేస్తుంటారు. కానీ, మిగిలిన రకాల కామెర్లు సోకినప్పుడు కచ్చితంగా చికిత్స అవసరం అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఈ నాటు పద్దతి అవలంబించటం వలన వ్యాధి ముదిరిపోతుంది. అంతిమంగా నివారణ కష్టతరం అవుతుంది. అందుచేత కామెర్లు వచ్చినప్పుడు సరైన వైద్యుని సంప్రదించి చికిత్స చేయించుకోవటం మంచిది.
No comments:
Post a Comment