సమస్య ఏర్పడినప్పుడు అది ఎందుకు ఏర్పడింది.. ఎందు వలన ఈ సమస్య పెరుగుతోంది... దీనికి మూలం ఏమిటి.. అన్నది ఆలోచించాలి.. అప్పుడు పరిష్కారం సాధ్యం అవుతుంది..!
ఇటీవల కాలంలో కాలేయ క్యాన్సర్ వ్యాధి గురించి తరచు వింటున్నాం. కాలేయానికి సోకే తీవ్రమైన వ్యాదుల్లో క్యాన్సర్ ఒకటి. ఒకప్పుడు క్యాన్సర్ వస్తే చికిత్స అసాద్యం అనుకొనే వారు. కానీ ఆధునిక పరిశోధనలతో క్యాన్సర్ కు చికిత్స లభిస్తోంది. ఇందులో ముఖ్యమైనది రేడియో ఫ్రీక్వన్సీ అబ్లేషన్ (ఆర్.ఎఫ్.ఎ.). ఇందులో భాగంగా విద్యుత్ శక్తి ద్వారా వేడిని రగులుస్తారు. ఈ వేడి తో కాలేయంలోని క్యాన్సర్ కణితిని విడగొట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్న రోగ కారక కణజాలాన్ని విచ్చిన్నం చేసే విధానమే ఈ ఆర్.ఎఫ్.ఎ. గతంలో ఈ విధానంపై కొన్ని అపోహలు ఉండేవి. అన్ని రకాల క్యాన్సర్ లకు ఈ విడగొట్టే ఆర్.ఎఫ్.ఎ. విధానమే పరిష్కారమా.. అన్న ప్రశ్న తలెత్తేది. అన్నింటికీ ఇది పరిష్కారం అని చెప్పలేం కానీ చాలా రకాల కాలేయ క్యాన్సర్ లకు ఇది సమర్థమైన పరిష్కారం అని చెప్పుకోవచ్చు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చేసే ఆర్.ఎఫ్.ఎ. సర్జరీ తో చాలా వరకు సైడ్ ఎఫెక్టులు లేకుండా పరిష్కారం సాధించుకోవచ్చు. క్యాన్సర్ ను గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోవటం ముఖ్యం అని గుర్తించుకోవాలి. ఒకే సారి పూర్తిగా నివారణ కాకపోతే కొన్ని సిట్టింగ్ ల ద్వారా పరిష్కారాన్ని సాధించవచ్చు. మరికొన్ని సార్లు ఆపరేషన్ తో పాటు ఇతర రకాల థెరపీలను వినియోగించాల్సి ఉంటుంది.

doctor garu, u r captions are interesting, off course content is also good. it is very useful information to all
ReplyDelete