ఎండా కాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఈ సారి సీజన్ లో ఏప్రిల్ నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎండలు భగ భగ లాడిస్తుంటే బయట తిరిగే వారు అల్లాడిపోతున్నారు.
ఎండలో తిరిగేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త ను మిస్ అవుతుంటాం.
కొంతమందికి కూల్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్న వారు ఎండా కాలంలో కూల్ వాటర్ మరింతగా తాగేస్తుంటారు. బాగా ఎండలో తిరిగి వచ్చాక శరీర భాగాలన్నీ వేడెక్కి ఉంటాయి. అంత మాత్రాన పూర్తిగా చల్లగా ఉండే కూల్ వాటర్ తీసుకోవటం సరికాదు. అప్పటి దాకా బాగా ఎండగా ఉండటంతో ఒక్క సారిగా కూల్ వాటర్ లోపలికి వెళితే శరీరం అంత త్వరగా ఎడ్జస్ట్ కావటం కష్టం అవుతుంది. అందుచేత ఒక వేళ ఎండలో తిరిగి వస్తే కాస్సేపు శరీరం స్థిమిత పడే దాకా ఉండి, ఆ తర్వాత చల్లటి నీరు తీసుకోవచ్చు. బాగా చల్లగా ఉండే కూల్ వాటర్ పదే పదే తాగటం సరికాదనే చెప్పాలి. అందుచేత కూల్ వాటర్ తీసుకొనేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోవాలి.
వాస్తవానికి మానవుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు సర్దుబాటు వ్యవస్థ శరీరంలోపలే ఉంటుంది. బయట ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు లోపలే దానికి తగినట్లుగా సర్దు బాటు జరిగిపోతుంది. అందుచేతనే ఉష్ణోగ్రత ఎంత పెరిగిపోయినా శరీర ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగానే ఉంటుంది. అంత మాత్రం చేత మనం .. ఎంతటి ఎండల్లో తిరిగేసినా ఫర్వాలేదు అనుకోవద్దు సుమా..! అందుచేత సాధ్యమైనంత వరకు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే మాత్రం వడదెబ్బ వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment