కడుపు మంట అంటే చాలా కారణాలు కనిపిస్తాయి. ఎందుచేత ఈ మంట వస్తోందో తెలుసుకొంటే అసలు విషయాలు అర్థం అవుతాయి. లేదంటే సమస్య పెద్దది అవుతుంది.
కడుపు లో అల్సర్ లు ఏర్పడినప్పుడు మాత్రం ఈ మంట తీవ్రంగా ఉంటుంది. జీర్ణాశయం పొరల్లో కానీ, ఆంత్ర మూలం (డుయోడినమ్ ) పొరల్లో కానీ ఇది ఏర్పడుతు ఉంటుంది. దీనికి నిర్దిష్టమైన కారణం ఉండక పోవచ్చు. హెలికో బాక్టర్ పైలోరీ వంటి బ్యాక్టీరియాల సంక్రమణ తో కానీ, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడకంతో కానీ, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటంతో కానీ ఇవి ఏర్పడుతుంటాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, కాలేయంలో సమస్యలు ఉన్నా కూడా ఇందుకు కారణం అవుతుంటాయి.
కడుపులో విపరీతంగా ముఖ్యంగా మధ్య లో కానీ, ఎగువ భాగంలో కానీ విపరీతంగా మంట పుడుతుంది. గుండెల్లో కూడా మంట ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు వాంతులు అవుతుంటాయి. ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, దురలవాట్లు వదిలేసుకోవటంతో పాటు నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకొంటే ఈ మంట సమస్య తగ్గుతుంది. మందులతో పాటు కొన్ని సార్లు చిన్న పాటి ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది. అందుచేత ప్రమాద తీవ్రతను బట్టి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
అల్సర్ ఉందని తెలియగానే కడుపులో ఆందోళన తెచ్చుకోకూడదు. దీంతో మంట, ఆందోళన మరింత పెరుగుతుంది. స్థిమితంగా వైద్యుల్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

No comments:
Post a Comment